Begin typing your search above and press return to search.

అమిత్ షా లేఖలో ప్రతిపక్ష నేత హత్య కుట్ర..! దేశ రాజకీయాల్లో దుమారం..

ప్రభుత్వం, ప్రతిపక్షం రెండు ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ప్రతి పక్ష నేతను కాపాడుకోవడం ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యమనే చెప్పాలి.

By:  Tupaki Political Desk   |   29 Sept 2025 2:37 PM IST
అమిత్ షా లేఖలో ప్రతిపక్ష నేత హత్య కుట్ర..!  దేశ రాజకీయాల్లో దుమారం..
X

ప్రభుత్వం, ప్రతిపక్షం రెండు ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ప్రతి పక్ష నేతను కాపాడుకోవడం ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి పక్ష నేతకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అది పాలక పక్షం నాయకుల వల్లే అని ప్రజల్లోకి సందేశం వెళ్తుంది. కాబట్టి ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వం కాపాడుకోవాల్సిందే. అంతెందుకు ఒక్కో సారి ప్రతిపక్షంలో సాధారణ కార్యకర్త మరణించినా అది ప్రభుత్వ చర్య అని అపోజిట్ పార్టీ చాటుకుంటూ సానుభూతి పొందుతుంది.

అమిత్ షాకు రాసిన లేఖలో ఏముందంటే..?

అయితే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని చంపుతానని ఒక నాయకుడు ఒక టీవీ చర్చా వేదికపై చెప్పడం దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. అసలు ఆ వివాదం ఎందుకు వచ్చిందనేది పక్కన పెడితే దేశంలోని ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని చంపుతాం అని బెదిరించడం సాధారణ విషయం కాదు. రాజకీయాల్లో హత్యా బెదిరింపులు, కేవలం వ్యక్తుల ప్రాణాలకే కాదు, ప్రజాస్వామ్య విలువలను సవాలు చేస్తాయి. తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో హత్య బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ విషయంపై కేసీ వేణుగోపాల్ హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసి ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాలి..

అయితే, ఈ బెదిరింపులు చేసిన వ్యక్తి రాజకీయ పక్షానికి చెందిన నాయకుడు కావడం విశేషం. ఇది వ్యక్తి గత కోపం లేదంటే వివాదాస్పద వ్యాఖ్యలు కావని, ప్రతిపక్ష నాయకుడిపై భద్రతను ప్రశ్నిస్తుందని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తు్న్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఇప్పటికే రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు ఉందని హోంశాఖకు సమాచారం అందించినా.. తక్షణ చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక బలహీనతను సూచిస్తోంది. ఇది అధికార వ్యవస్థలు సకాలంలో స్పందించకపోవడం ఎంతటి సమస్యకు దారితీస్తుందో సూచిస్తుంది.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి సవాలు..

ప్రతిపక్ష నేతలపై బెదిరింపులు వ్యక్తి గతం కాకుండా.. ప్రజాస్వామ్య స్ఫూర్తి, మౌలిక హక్కుల భద్రతకు సవాలుగా మారుతున్నాయి. నాయకుల భద్రతపై ఏర్పడిన ఆందోళన, మిగతా నేతలకు, రాజకీయ కార్యకర్తలకు ఆందోళన కరంగా ఉంటుంది. కేసీ వేణుగోపాల్ అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరగడం, ప్రభుత్వం దానిపై తక్షణ చర్యలు తీసుకోవకపోవడం ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. ప్రత్యక్ష చర్యలు లేకపోవడం కేవలం వ్యక్తిపై నిర్లక్ష్యం కాక, ప్రతిపక్షం, రాజకీయ వ్యవస్థలపై అవమానం అని భావించవచ్చు.

ఇది గట్టి హెచ్చరిక..

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షణ, నాయకుల భద్రత, ప్రజల విశ్వాసం అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. ఈ ఉదంతం దేశానికి ఒక గట్టి హెచ్చరికగా నిలవాలి. హోం మంత్రిత్వ శాఖ భద్రతా అధికారాలు తక్షణ, పారదర్శక చర్యలు చేపట్టకపోతే, ఈ వ్యవస్థలపై ప్రజల నమ్మకం మరింత బలహీనమవుతుందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.