వావ్ అనిపించే ఆవిష్కరణ.. ఉక్కుకు మించిన చెక్క
ప్రపంచ చరిత్రను.. గమనాన్ని మార్చే ఆవిష్కరణలు కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే వస్తుందని చెప్పక తప్పదు.
By: Garuda Media | 26 Nov 2025 8:00 PM ISTప్రపంచ చరిత్రను.. గమనాన్ని మార్చే ఆవిష్కరణలు కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే వస్తుందని చెప్పక తప్పదు. శక్తికి నిర్వచనంగా ఉక్కును చెబుతారు. అందుకే ఉక్కు పిడికిలి.. ఉక్కు మనిషి.. ఇలా ఉక్కుతో ప్రస్తావించటం ద్వారా గట్టితానానికి నిదర్శనంగా చెబుతారు. అలాంటిది ఉక్కుకు మించిన గట్టితనంతో ఉండే చెక్కను ఆవిష్కరించటం మామూలు విషయం కాదు. ఈ ఘనతను తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
ఈ సూపర్ వుడ్ ప్రత్యేకత ఏమంటే.. అల్యూమినియం కంటే తేలికగా.. ఉక్కుకు మించిన గట్టిదనంతో పాటు.. పర్యావరణరహితమైన చెక్కను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అమెరికాలోని మేరీ ల్యాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. ఇంతకు ఈ ఘనతను ఎలా సాధించారు? అన్న విషయంలోకి వెళితే.. సాధారణ చెక్కనే రసాయన.. యాంత్రిక మార్పులకు గురి చేయటం ద్వారా ఉక్కుకు మించిన గట్టితనాన్ని తీసుకురావచ్చన్న విషయాన్ని ప్రపంచానికి చాటారు. ఉక్కు బరువుతో పోలిస్తే ఈ చెక్క ఆరోవంతే బరువు ఉండటం గమనార్హం.
గట్టితనం విషయంలో మాత్రం ఉక్కు కంటే పది రెట్లు ఎక్కువగా ఉండటమేకాదు.. భూమిలో కలిసిపోయే పదార్థం కావటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఇంతకూ ఈ శక్తివంతమైన చెక్కను ఎలా తయారు చేశారనన విషయంలోకి వెళితే.. చెక్కలోని ముఖ్యభాగమైన సెల్యూలోజ్.. హెమీసెల్యూలోజ్.. లగ్నిన్ లను కొంత మేర తొలగించినట్లుగా చెబుతున్నారు. చెక్కలో ఉండే లిగ్నిన్.. చెక్కకు గోధుమ రంగును.. గట్టిదానాన్ని ఇస్తుంది.
లిగ్నిన్ ను ఎక్కువగా.. హెమీ సెల్యూలోజ్ ను కొంతమేర తొలగిస్తారు. దీంతో చెక్క సాఫ్ట్ గా మారుతుంది. ఆ తర్వాత అధిక ఒత్తిడి.. ఎక్కువ ఉష్ణోగ్రతను ఉపయోగించి చెక్కను కంప్రెస్ చేస్తారు దీంతో.. చెక్కలో ఉండే సూక్ష్మంగా ఉండే రంధ్రాలు ఒకదానితో మరొకటి అతుక్కుపోయేంత దగ్గరగా జరుగుతుంది. దీంతో సదరు చెక్క అధిక సాంద్రత కలిగిన బ్లాకుగా మారుతుంది. అదే పరిమానంలో ఉన్న సాధారణ చెక్కతో పోలిస్తే.. ఈ సూపర్ వుడ్ 3 నుంచి 10 రెట్లు ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుందని తేల్చారు. ఈ చెక్క బరువు ఆయా లోహాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని గుర్తించారు. ఈ సూపర్ వుడ్ ను ప్రయోగశాలకే పరిమితం చేయకుండా.. ఇన్వెంట్ వుడ్ అనే కంపెనీని స్పెషల్ గా షురూ చేసి.. కమర్షియల్ గా మార్కెట్లోకి తీసుకొచ్చారు.
