గాల్లో బట్టలూడదీసిన భామ.. ఫ్లైట్‌లో వింత డ్రామా.. షాక్‌లో ప్యాసింజర్లు
ఆకాశంలో విమానం జోరుగా వెళ్తోంది. అందరూ ప్రశాంతంగా తమ సీట్లలో కూర్చుని విండో వ్యూ చూస్తూనో.. లేక ఫోన్లలో మునిగిపోతూనో ఉన్నారు.
By: A.N.Kumar | 16 Sept 2026 4:56 PM ISTఆకాశంలో విమానం జోరుగా వెళ్తోంది. అందరూ ప్రశాంతంగా తమ సీట్లలో కూర్చుని విండో వ్యూ చూస్తూనో.. లేక ఫోన్లలో మునిగిపోతూనో ఉన్నారు. అంతా ఓకే అనుకునేలోపే.. ఊహించని బిగ్ బాస్ రేంజ్ ట్విస్ట్.. ఒక మహిళ ఏకంగా 'నా ఇష్టం.. నా స్టైల్' అంటూ ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పేసి.. క్యాబిన్ నడిరోడ్డు అనుకుని నగ్నంగా హల్‌చల్ చేయడం మొదలెట్టింది. ఈ వింత సంఘటన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో జరిగి.. ప్రస్తుతం నెట్టింట హట్ టాపిక్‌గా మారింది.
బాల్టిమోర్ టు మియామీ.. విత్ అదనపు ఎంటర్‌టైన్‌మెంట్..
సెప్టెంబర్ 11న బాల్టిమోర్ నుంచి మియామీ వెళ్తున్న ఏఏ1779 అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ కామెడీ విత్ హర్రర్ సీన్ ప్లే అయింది. 9డీ సీటులో కూర్చున్న ఓ పుణ్యాత్మురాలు ప్రయాణ మధ్యలో సడన్‌గా తన బట్టలన్నీ విప్పేసింది. అంతటితో ఆగకుండా తోటి ప్రయాణికుల ముందు కళ్ళు బైర్లు కమ్మేలా వింతగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఆమె నయా అవతారం చూసి పక్కనున్న ప్యాసింజర్లు "అయ్య బాబోయ్.. మనకేం పోయేకాలం" అని కళ్ళు మూసుకుంటే ఫ్లైట్ అటెండెంట్లు మాత్రం షాక్‌తో నోరెళ్లబెట్టారు.
కాక్‌పిట్‌కి మెసేజ్.. ల్యాండ్ అవ్వడమే ఆలస్యం..
పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన లీడ్ ఫ్లైట్ అటెండెంట్, వెంటనే కాక్‌పిట్‌కు, అక్కడి నుంచి అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఆపరేషన్స్ సెంటర్‌కు అత్యవసర సమాచారం అందించారు. "సామీ.. ఇక్కడొక ఆవిడ బట్టలు విప్పేసి హంగామా చేస్తోంది, ల్యాండ్ అవ్వగానే పోలీస్ జీపు సిద్ధంగా ఉంచండి" అని కేక పెట్టేశారు. అయితే ఈ రచ్చ కారణంగా ఫ్లైట్‌ను ఎక్కడా దారి మళ్లించకుండా గప్‌చుప్‌గా మియామీకే తీసుకెళ్లడం విశేషం.
ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్కమ్..
రాత్రి 11:23 గంటలకు మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవ్వడమే తడవు.. ప్లాన్ ప్రకారం పోలీసులు రయ్యిమని గేట్ వద్దకు వచ్చేసారు. మేడమ్ గారి అసభ్యకర ప్రదర్శనకు ముగింపు పలుకుతూ పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని తీసుకెళ్లారు.
పాపం.. ఆవిడకి ఉన్నట్టుండి ఫ్యాషన్ షో చేయాలనిపించిందో లేక గాల్లో వేడి ఎక్కువై బట్టలు బారమనిపించిందో కానీ ఆమె చేసిన పనికి తోటి ప్రయాణికులకు మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు ఆమె ఎందుకలా చేసింది? ఆమెపై ఏ ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారనే వివరాలను పోలీసులు ఇంకా రహస్యంగానే ఉంచారు. ఏది ఏమైనా టికెట్ కొన్న పైసలకి ప్రయాణికులకు అనవసరమైన ‘లైవ్ షో’ ఉచితంగా లభించింది.
