Begin typing your search above and press return to search.

ఇరాన్ పై అమెరికా కొత్త బాంబు !

ఈ బాంబు అధికారిక పేరు GBU-43/B Massive Ordnance Air Blast (MOAB). దీని నిక్ నేమ్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్.

By:  Garuda Media   |   15 Oct 2026 11:00 PM IST
ఇరాన్ పై అమెరికా కొత్త బాంబు !
X

యుద్ధంలో భాగంగా అమెరికా ఇరాన్ మీద ఒక కొత్త అతిపెద్ద బాంబు ప్రయోగించనుందన్న వార్త సంచలనం రేపుతున్నది. సీఎన్ఎన్ ప్రకటించిన రిపోర్ట్ ప్రకారం ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (MOAB)’గా చెప్పుకునే ప్రయోగించే అవకాశం ఉందని సమాచారం. అయితే అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికల నేపథ్యంలో దీనిని ఎన్నికల ముందు లేదా తర్వాత వేయొచ్చని భావిస్తున్నారు.

ఈ బాంబు అధికారిక పేరు GBU-43/B Massive Ordnance Air Blast (MOAB). దీని నిక్ నేమ్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. దీని బరువు 9.8 టన్నులు ఉంటుందని, దీని తయారీలో 18,700 పౌండ్ల ఆర్డీఎక్స్, టీఎన్టీ, అల్యూమినియం పౌడర్ మిశ్రమం వాడారని తెలుస్తుంది.

దాదాపు 30 అడుగుల పొడవు, 40.5 అంగుళాల వ్యాసం ఉన్న ఈ బాంబు భూమికి ఆరు అడుగుల ఎత్తులో పేలుతుందని, భూమి లోపలికి చొచ్చుకు పోతుందని తెలుస్తోంది. ఇది పేలిన చోట నుండి 1.6 కిలోమీటర్ల పరిధిలో భవనాలు, వాహనాలు, కొండలు, లోయలు, టన్నెల్స్ అంతా నాశనం అయిపోతుంది.

2017లో ఆఫ్ఘనిస్తాన్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తలదాచుకున్న టన్నెల్స్ మీద వేసినప్పుడు 90 మంది మరణించారు. ఇరాన్ లో అయిల్, గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నేపథ్యంలో ఎక్కువ నష్టం జరుగుతుందని భావిస్తున్నారు.

2000 సంవత్సరంలో ఇది తయారు చేసినప్పుడు అయిన ఖర్చు లక్ష 70 వేల డాలర్లు. అప్పట్లో ఇవి దాదాపు 15 యూనిట్లు తయారు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే యుద్దం ప్రస్తుతం డెడ్ లాక్ లో ఉంది. మిడ్ టర్మ్ ఎన్నికల తర్వాత ట్రంప్ విజయం సాధించినట్లు ప్రకటించి సైన్యాన్ని వెనక్కి తీసుకోవచ్చని చర్చ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.