Begin typing your search above and press return to search.

టెర్రరిజం : పాక్ కు మద్దతు.. భారత్ కు కంటితుడుపు.. అమెరికా బుద్ది మారదా?

భారతదేశం దశాబ్దాలుగా పాకిస్థాన్ భూభాగం నుంచే జరుగుతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ విషయం అనేక సార్లు నిరూపితమైనప్పటికీ అమెరికా మాత్రం పాక్‌ పట్ల సానుభూతిని చూపిస్తూ వచ్చింది.

By:  A.N.Kumar   |   12 Nov 2025 10:04 PM IST
టెర్రరిజం : పాక్ కు మద్దతు.. భారత్ కు కంటితుడుపు.. అమెరికా బుద్ది మారదా?
X

టెర్రరిజం విషయంలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ నీతి మరోసారి స్పష్టంగా బయటపడింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై అమెరికా స్పందన, పాకిస్థాన్‌లో జరిగిన దాడులపై దాని స్పందనతో పోల్చినప్పుడు ఈ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఢిల్లీ పేలుడుపై అమెరికా వైఖరి

ఢిల్లీలో పేలుడు సంభవించిన తర్వాత అమెరికా రాయబార కార్యాలయం నుండి వచ్చిన స్పందన విమర్శలకు దారితీసింది. అమెరికా ఎంబసీ చేసిన ట్వీట్‌లో ఎక్కడా "టెర్రరిజం" అనే పదాన్ని ప్రస్తావించలేదు. కేవలం బాధితులకు సానుభూతిని తెలియజేస్తూ, సాధారణ ట్వీట్‌తో సరిపెట్టింది. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత మాత్రమే అమెరికా స్పందించింది. భారత్‌లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదంపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం సానుభూతితో ముగించడం భారత ప్రజల్లో, ముఖ్యంగా సోషల్ మీడియా నెటిజన్లలో, తీవ్ర అసహనాన్ని రేపింది.

పాకిస్థాన్‌పై దాడులు: వెంటనే స్పందన, మొసలి కన్నీరు

ఇదే అమెరికా.. పాకిస్థాన్‌లో చిన్నపాటి దాడి జరిగినా వెంటనే స్పందిస్తుంది. పూర్తిగా భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తుంది. పాక్‌లో దాడులు జరిగిన వెంటనే స్పందించి "టెర్రరిజం ఒక దుష్ట శక్తి" అని పేర్కొంటూ, ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు ట్వీట్ చేస్తుంది. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో పాకిస్థాన్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించడానికి ఏమాత్రం వెనుకాడలేదు.

ఈ రెండు రకాల స్పందనల మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసం అమెరికా విదేశాంగ విధానంలోని స్వార్థాన్ని , ద్వంద్వ నీతిని స్పష్టం చేస్తోంది.

రాజకీయ స్వార్థమా? అంతర్జాతీయ న్యాయం పట్ల అవమానమా?

భారతదేశం దశాబ్దాలుగా పాకిస్థాన్ భూభాగం నుంచే జరుగుతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ విషయం అనేక సార్లు నిరూపితమైనప్పటికీ అమెరికా మాత్రం పాక్‌ పట్ల సానుభూతిని చూపిస్తూ వచ్చింది. ఒకవైపు "టెర్రర్‌ ఫ్రీ వరల్డ్‌" అంటూ ప్రపంచానికి బోధనలు చేస్తూ మరోవైపు రాజకీయ , విదేశాంగ స్వార్థ ప్రయోజనాల కోసం "దేశం బట్టి ఉగ్రవాద నిర్వచనం మారుతుంది" అనే విధంగా వ్యవహరించడం గమనార్హం.

నెటిజన్లు మండిపడుతున్నట్లుగా ఉగ్రవాదం ఏ దేశంలో జరిగినా అది ఉగ్రవాదమే. కానీ అమెరికా స్పందన మాత్రం దేశాన్ని బట్టి మారడం కేవలం రాజకీయ స్వార్థమే తప్ప, అంతర్జాతీయ న్యాయం పట్ల గౌరవం కాదని చెప్పాలి. ఉగ్రవాదంపై అమెరికా చెప్పే మాటలకు, దాని ఆచరణకు మధ్య ఉన్న ఈ వైరుధ్యం అంతర్జాతీయ సమాజంలో విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.