Begin typing your search above and press return to search.

సినిమాల్లోకి ఎంట్రీ.. అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అవకాశం వస్తే, తాను రాజకీయ రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించడానికి సిద్దమేనని అన్నారు. సినిమాలలో నటనపై అంబటి చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   15 March 2026 10:53 AM IST
సినిమాల్లోకి ఎంట్రీ.. అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

సినిమాల్లో నటించడంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే సినిమాల్లో నటించేందుకు సిద్ధమే అన్నారు అంబటి. సినిమాల్లో నటించడం తప్పు కాదు కదా? అంటూ ప్రశ్నించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహించే మాజీ మంత్రి అంబటి రాంబాబు నృత్యాలు చేస్తూ సందడి చేస్తుంటారు. ఈ విషయమై ఇంటర్య్వూలో అడిగిన ప్రశ్నపై అంబటి సరదా వ్యాఖ్యలు చేశారు.

సంక్రాంతి సంబరాలపై ఆన్ లైన్ లో ఉన్న వీడియోలకు రకరకాల కామెంట్లు వస్తుంటాయి. ఇందులో కొన్ని కామెంట్లను అంబటి దృష్టికి తీసుకువెళ్లారు. మీ నృత్యాలు బాగుంటాయి. సినిమాల్లో నటించొచ్చు కదా అంటూ వచ్చిన ఓ కామెంట్ పై స్పందించాల్సిందిగా అంబటిని అడిగితే సరదాగా తీసుకున్నారు. సినిమాల్లో నటించడం తప్పుకాదు కదా, వయసు, హోదాకు తగినట్లు హుందా ఉన్న పాత్ర వస్తే నటిస్తానంటూ వ్యాఖ్యానించారు. సినిమా, రాజకీయ రంగాలు రెండు బాగా పాపులర్ రంగాలని, ఇప్పటివరకు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎంతో మంది రాణించారని అంబటి గుర్తు చేశారు.

అవకాశం వస్తే, తాను రాజకీయ రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించడానికి సిద్దమేనని అన్నారు. సినిమాలలో నటనపై అంబటి చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండే మాజీ మంత్రి అంబటి మంచి మాటకారి. ఆకట్టుకునే మాటతీరుతో రాజకీయంగా ఓ స్థాయికి చేరుకున్నారు. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ సారి సంక్రాంతి సందర్భంగా ఆయన చేసిన నృత్యం సోషల్ మీడియాను ఆకట్టుకుంది. చాలా సహజ సిద్ధంగా డ్యాన్స్ చేస్తూ ఆయన అలరించారు.

అయితే ఆయన నృత్యం చేయడాన్ని రాజకీయ ప్రత్యర్థులు ట్రోల్ చేసినా, అంబటి తగ్గలేదు. ఓ సినిమాలో అంబటి డ్యాన్స్ పై పేరడీ కూడా చేశారు. దీంతో అంబటి డ్యాన్స్ లు మరింత వైరల్ అయ్యాయి. రాజకీయంగా ఈ విషయమై ఎలాంటి విమర్శలు ఉన్నప్పటికీ సీనియర్ నేత అంబటి రాంబాబులో మంచి కళాకారుడు ఉన్నాడని అందరూ గుర్తించారు. ఈ విషయంలో అంబటి కూడా ఎలాంటి సంకోచం చూపడం లేదు. డ్యాన్స్ చేస్తే తప్పేంటి? అంటూ ప్రశ్నిస్తుంటారు. నిజంగా ఆయన వయసు వారు అలా సరదాగా, హుషారుగా ఉండటం అభినందంచాల్సిన విషయమేనని అంటున్నారు.