నేను కాపును కానా ...పాయింటే మరి !
రాజకీయం అంటేనే అన్ని ముడిసరుకులు కలుపుకునే అదేదో బ్రహ్మపదార్ధం అనుకోవాలి. ఏపీ రాజకీయం అంటే అది మరీ ఎక్కువ.
By: Satya P | 20 Feb 2026 1:19 PM ISTరాజకీయం అంటేనే అన్ని ముడిసరుకులు కలుపుకునే అదేదో బ్రహ్మపదార్ధం అనుకోవాలి. ఏపీ రాజకీయం అంటే అది మరీ ఎక్కువ. కులాల సమీకరణలు సంకుల సమరాలు ఇల్లా లెక్కలు చిక్కులు బోలెడు ఉంటాయి. 18 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా విషయాలు చెప్పారు, కొన్ని సార్లు ధర్మ సందేహాలు వ్యక్తం చేశారు. ఆఖరుకు తాను కాపును కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఇలా అంబటి ఆగ్రహం ఆవేదన వీటన్నిటినీ మేళవించి నిర్వహించిన ప్రెస్ మీట్ లో బోలెడు విషయాలే చెప్పారు.
దాడి జరిగితే రియాక్ట్ కారా :
నేను కాపునే కదా నా ఇంటి మీద దాడి జరిగితే రియాక్ట్ కారా అంటూ అంబటి రాంబాబు మీడియా ముఖంగా కీలక ప్రశ్నలు సంధించారు. కాపులు అంటే పవన్ కళ్యాణ్, నాగబాబు మాత్రమేనా అని ఆయన లాజిక్ పాయింటూ తీశారు. అసలు అన్యాయాన్ని అన్యాయం అని చెప్పలేని పవన్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని కూడా అనేశారు. తాను అసహ్యకరంగా తిట్టాను అని పవన్ అన్నారు. దానికి చట్టప్రకారం తనను శిక్షించాలి కానీ ఇంటి మీద దాడులు చేస్తారా అని అంబటి ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు.
పవన్ తిట్టలేదా అంటూ :
విపక్షంలో ఉన్నపుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను తిట్టలేదా అని అంబటి నిలదీశారు కొడకల్లారా అని చెప్పులు చూపించి మరీ పవన్ చేసిన దాన్ని తిట్టిన దాన్ని ఏమనాలి అని ప్రశ్నించారు. తన మీదకు అల్లరి మూకలు దాడి చేసి కారు మీద పడితే తాను సహనం కోల్పోయి బాబుని తిట్టానని దానికి క్షమాపణ కూడా చెప్పాను అని అంబటి వివరణ ఇచ్చారు అయినా సరే తనను తీసుకెళ్ళి జైలులో వేశారు అని తన ఇంటి మీద గంటల తరబడి దాడులు చేసిన వారికి ఏ శిక్ష విధించారు అని ప్రశ్నించారు.
వంగవీటి రంగా నుంచి :
కాపుల విషయంలో ఎపుడూ ఇలాగే జరుగుతోంది అని అంబటి అంటూ వంగవీటి రంగాను ఇలాగే కోల్పోయానమి అన్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబం మీద దాడి చేశారు అని గుర్తు చేశారు. ఆనాడు ముద్రగడకు అండగా ఉన్నది తాను అని అన్నారు. కాపులకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను గొంతు ఎత్తాను అని ఆయన చెప్పారు. కానీ కాపు కులానికి చెందిన అంబటి మీద దాడి జరిగితే మాత్రం ఎవరూ రియాక్ట్ కారా అని ఆయన ఫైర్ అయ్యారు.
ప్రతీ కుక్కకూ రోజు :
ప్రతీ కుక్కకూ ఒక రోజు వస్తుందని అంబటి ఈ సందర్భంగా ఒక సామెతను ఆయన గుర్తు చేస్తూ వ్యాఖ్యానించారు. తమకు కూడా భవిష్యత్తు ఉందని ఆయన చెప్పుకొచ్చారు అన్న మాట. తాము సైతం ఎవరినీ వదిలేది లేదని అన్యాపదేశంగానో పరోక్షంగానో అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు అంటున్నారు. ఏది ఏమైనా అంబటి ప్రెస్ మీట్ ఈసారి పవన్ మీదకు మళ్ళింది. పవన్ నాగబాబు ఇద్దరూ కాపుల విషయంలో నోరు ఎత్తడం లేదు అని ఆయన టోన్ మార్చి మరీ విమర్శల జోరు పెంచారు. మరి అండగా ఉండే కాపును నేనే అంటూ అంబటి చేస్తున్న ఈ కామెంట్స్ పెంచుతున్న సౌండ్ ఏపీ రాజకీయాల్లో ఏ పరిణామాలకు దారి తీస్తాయో చూడాల్సి ఉంది.
