'చంద్రబాబు అమ్మ మొ*గుడిని రమ్మను'... రెచ్చిపోయిన అంబటి!
తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 31 Jan 2026 4:16 PM ISTతిరుమల లడ్డూ అంశంపై వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కార్యక్రమం తాజాగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సమయంలో గుంటూరు జిల్లాలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును టీడిపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ సమయంలో అంబటి మాటల్లో గీత దాటారు! ఇది సంచలనంగా మారింది!
అవును... వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంతో గుంటూరు జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు గోరంట్లకు వెళ్తున్న సమయంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కర్రలు, ఇనుప రాడతో దాడులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో అంబటి వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది!
ఈ క్రమంలో వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోన్న నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ సమయంలో అంబటి రాంబాబు సహనం కోల్పోయారు.. దుర్భాషలాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా అని ప్రశ్నించిన అంబటి రాంబాబు.. టీడీపీ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారని ఆరోపించారు.
కర్రలు, రాడ్లు పట్టుకుని నడిరోడ్లపై టీడీపీ కార్యకర్తలు తిరుగుతున్నప్పటికీ పోలీసులు చూసీచూడనట్లు ఉన్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు కావాలనే అరాచకం సృష్టిస్తున్నారని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సంస్కృతి తగదని వ్యాఖ్యానించారు. అయితే.. ఆయన వాహనాన్ని జనాలు ఆపినప్పుడు.. "యే ల*కొడుకు వస్తాడో రమ్మను" అంటూ వ్యాఖ్యానించిన అంబటి రాంబాబు.. ఆయనను పోలీసులు కారు ఎక్కించి పంపించే క్రమంలో.. "చంద్రబాబు అమ్మ మొగుడిని రమ్మను!" అని అన్నారు.
దీంతో ఈ బూతుల వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. నేరుగా ముఖ్యమంత్రిపైనే అంబటి రాంబాబు బూతుల వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన గీత దాటేశారని.. ఇక యుద్ధం తప్పదంటూ సోషల్ మీడియాలో తమ్ముళ్లు కామెంట్లు పెడుతున్నారు. అంబటి ఏ పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. అవి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెబుతున్నారు!
