Begin typing your search above and press return to search.

మనం 2026లో ఉంటే వారేమో 2976 ఏడాదికి స్వాగతం చెబుతున్నారు

ప్రపంచం మొత్తానికి కొత్త సంవత్సరం 2026 సంబరాలు చేసుకోవటం తెలిసిందే. ఇప్పుడు చెప్పే దేశస్తుల రూటు సపరేటు.

By:  Garuda Media   |   16 Jan 2026 12:00 PM IST
మనం 2026లో ఉంటే వారేమో 2976 ఏడాదికి స్వాగతం చెబుతున్నారు
X

ప్రపంచం మొత్తానికి కొత్త సంవత్సరం 2026 సంబరాలు చేసుకోవటం తెలిసిందే. ఇప్పుడు చెప్పే దేశస్తుల రూటు సపరేటు. వీరు కొత్త సంవత్సరం సంబరాలు చేసుకుంటున్నారు. కానీ.. మిగిలిన ప్రపంచ దేశస్తుల మాదిరి కాకుండా వీరికి సంవత్సరం లెక్కలు పూర్తిగా వేరుగా ఉంటాయి. వీరిప్పుడు కొత్త సంవత్సరంగా 2976కు స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకూ వీరెక్కడ ఉంటారు? అన్న ప్రశ్నకు సమాధానంలోకి వెళితే.. ఉత్తర ఆఫ్రికాలోని అమెజిగ్ ప్రజలు తమ కొత్త సంవత్సరంగా 2976కు వెల్ కం చెబుతూ తమదైన శైలిలో సంబరాలు చేసుకుంటున్నారు.

మిగిలిన వారికి వీరికి తేడా ఏంటి? వీరెందుకు వెయ్యేళ్లు ముందు ఉన్నట్లు? అన్న విషయంలోకి వెళితే.. వాళ్లు అనుసరించే క్యాలెండర్ 950 బీసీలో మొదలవుతుంది. యెన్నాయర్ అని పిలిచే అమెజిగ్ ల కొత్త సంవత్సరం జనవరి 12 నుంచి 14 మధ్యలో మొదలవుతుంది. వాళ్లు నివసించే అల్జీరియా.. మొరాకో.. ట్యునీషియా.. లిబియా లాంటి ప్రాంతాలకు అనుగుణంగా వేర్వేరు తేదీల్లో కొత్త ఏడాది వేడుకల్ని జరుపుకుంటారు.

అమెజిగ్ అంటే స్వేచ్ఛా జీవులుగా చెబుతారు. ఈ జాతి ప్రజలు ఉత్తర ఆఫ్రికా ప్రాంతపు అసలుసిసలు ఆదిమ జాతులుగా చెబుతారు. చరిత్రను రాయటం మొదలు పెట్టిన నాటి నుంచి వీరు ఇక్కడే ఉంటారని చెబుతారు. అధికారిక గణాంకాలు లేని కారణంగా ఈ జాతి జనాభా ఎంతన్నది అధికారిక గణాంకాలు లేవు. ఒక అంచనా ప్రకారం ఉత్తర ఆఫ్రికా వ్యాప్తంగా కోట్లల్లో ఈ జాతి ప్రజలు ఉంటారని చెబుతారు.

తమ కొత్త సంవత్సర సంబరాల్లో భాగంగా వీరి కుటుంబాలు కొద్ది రోజులుగా రంగు రంగు సంప్రదాయ దుస్తుల్ని ధరించి.. పాటలు పాడుకుంటూ విందులు చేసుకోవటం కనిపిస్తుంది పల్లెలు మొదలు పట్టణాల వరకు నూతన సంవత్సర శుభాకాంక్షల్ని ‘అసెగ్గాస్ అమెగ్గాజ్’ అంటూ చెప్పుకోవటం కనిపిస్తుంది. వీరి సంప్రదాయ దుస్తులు బ్రైట్ కలర్స్ తో కూడిన ఎంబ్రాయిడరీ దుస్తుల్ని ధరించి మెరిసిపోతుంటారు.