Begin typing your search above and press return to search.

వైసీపీకి స‌ల‌హా: అమ‌రావ‌తిపై సైలెంటే బెట‌ర్ ..!

దీనిని మరింత విస్తరించి మహానగరంగా ఒకరకంగా చెప్పాలంటే ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది కూడా సీఎం చంద్రబాబు ఉద్దేశం.

By:  Garuda Media   |   14 Sept 2025 9:13 AM IST
వైసీపీకి స‌ల‌హా: అమ‌రావ‌తిపై సైలెంటే బెట‌ర్ ..!
X

ఏపీ రాజధాని అమరావతి విషయంపై వైసీపీ నాయకులు మాట్లాడకుండా ఉంటేనే మంచిదా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిని అనేక విమర్శలు తో వేడెక్కించేలా చేశారు. రైతుల ఉద్యమాలను అణిచేసే ప్రయత్నం చేశారు. రైతులపై లాఠీచార్జి చేయించారు. మూడు రాజధానులు అంటూ ఐదు సంవత్సరాలు కాలం గడిపేశారు. తాజాగా ఇప్పుడు అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే.

దీనిని మరింత విస్తరించి మహానగరంగా ఒకరకంగా చెప్పాలంటే ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది కూడా సీఎం చంద్రబాబు ఉద్దేశం. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అమరావతి రాజధాని వ్యవహారం రాజకీయంగా కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. దీనినే ప్రధాన అజెండాగా చూపించి ఎన్నికల్లో ఓట్లు అడిగే అంశం కూడా తెరమీదకు రానుంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ నాయకులు అమ‌రావ‌తిపై తాజాగా స్పందించిన తీరు ఎలా ఉన్నప్పటికీ ప్రజల నుంచి మాత్రం తీవ్ర విమర్శలు మూట కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అమరావతిని స్మశానంతోను దయ్యాల రాజధానితోను పోల్చారు.

తర్వాత అక్కడ నిర్మాణాలు కూడా జరగకుండా అడ్డుకున్నారు. రహదారులు కూడా తోవ్వేసినా ఎవరూ పట్టించుకోలేదు. భారీ ఎత్తున చెట్లు పెరిగి ఒక అడవి ప్రాంతంలాగా రాజధాని మారిపోయినా వైసిపి నాయకులు చెలించలేదు. కానీ, ఇప్పుడు మళ్లీ తాము అధికారంలోకి వస్తే అమరావతి లోనే ఉంటామని.. అమరావతి నుంచే జగన్ పాలన సాగిస్తాడని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే దీనిని అమరావతి వరకే పరిమితం చేస్తామని కేవలం రాజధానిగా మాత్రమే చూస్తామని మాత్రం వ్యాఖ్యానించారు.

అయితే అసలు మొదటి నుంచి అమరావతికి తీవ్ర వ్యతిరేకంగా ఉన్న వైసిపి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తామని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలోనే మూడు రాజధానులను తెర‌మీదకు తీసుకురావడం.. రైతులు ఆందోళన చేసినా పట్టించుకోకపోవడం వారి ఉద్యమాలను కూడా అణిచేయ‌డం తెలిసిందే. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మాట మార్చి అమరావతి లోనే ఉంటారని.. అమరావతిలోనే కార్యకలాపాలు కొనసాగిస్తామని చెప్పటం పై అన్ని వర్గాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే కీలకమైన అమరావతి ప్రాజెక్టు ఈ రకంగా నాశనం అవ్వడానికి కానీ ఖర్చు పెరగడానికి కానీ రైతులు ఇబ్బందులు పడడానికి కానీ వైసీపీ నే కారణం అన్నది ప్రజల్లో జరుగుతున్న చర్చ.

ఇలాంటి నేపథ్యంలో అమరావతి గురించి మరోసారి స్పందిస్తూ.. తాము మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడ నుంచే కార్యకర్తల నిర్వహిస్తామని చెప్పడం ద్వారా వైసిపి నాయకులు లేనిపోని విమర్శలు మూట కట్టుకోవడం మినహా వారు సాధించేది ఏమీ లేదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. కాబట్టి భవిష్యత్తులో అయినా అమరావతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే వైసీపీకి అంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని, ఎన్నికల సమయం నాటికి ఉండే పరిస్థితులు అనుగుణంగా వారు స్పందిస్తే మంచిదని కూడా చెబుతున్నారు.