Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి రైతుల ఆగ్ర‌హం.. ఏం జ‌రిగింది?

అమరావతి రైతులు తొలిసారి ఘాటుగా స్పందించారు. ప్రభుత్వానికి బహిరంగంగా డిమాండ్లు ఇచ్చారు.

By:  Garuda Media   |   13 Oct 2025 12:08 PM IST
అమ‌రావ‌తి రైతుల ఆగ్ర‌హం.. ఏం జ‌రిగింది?
X

అమరావతి రైతులు తొలిసారి ఘాటుగా స్పందించారు. ప్రభుత్వానికి బహిరంగంగా డిమాండ్లు ఇచ్చారు. ఇప్పటి వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహారించామని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజ‌ధాని రైతుల విష‌యంలో అనుస‌రిస్తున్న‌ విధానాల‌పై ఆదివారం గుంటూరులో అమరావతి రైతు జెఎసీ నేత‌లు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా స‌ర్కారు తీరుపై అమరావ తి రైతులు తొలిసారి తీవ్రంగా స్పందించారు. వేల ఎక‌రాలు ఇచ్చిన త‌మ‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాదు.. సీఆర్ డీఏ(రాజ‌ధాని ప్రాంత అభివృద్ది సంస్థ‌)లో అవినీతి పెరిగిందని అన్నారు.

రాష్ట్రంలో కొత్త‌ ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు అయినప్పటికీ.. అనేక సమస్యలు పేరుకు పోయాయ ని తెలిపారు. అనేకసార్లు సిఆర్‌డిఏ అధికారులు, మంత్రి నారాయ‌ణ‌కు వినతి పత్రాలు ఇచ్చినా.. పరిష్కా రం కాలేదని తెలిపారు. ఈ నేప‌థ్యంలో రానున్న ప‌ది రోజుల్లోనే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా స‌ర్కారుకు ప‌లు డిమాండ్ల‌ను వినిపించారు. వీటిని ప‌రిష్క‌రించ‌క‌పోతే.. ప‌రిణా మాలు తీవ్రంగా ఉంటాయ‌ని రైతులు హెచ్చ‌రించడం గ‌మ‌నార్హం.

ఇవీ.. రైతుల డిమాండ్లు..

1) అసైన్డ్‌ రైతుల సమస్యల ప‌రిష్కారం.

2) రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతుల‌కు కౌలు చెల్లింపు క్రమబద్దీకరణ చేయాలి.

3) రోడ్డుపోటు ప్లాట్ల సమస్య, ప్లాట్ల కేటాయింపు సమస్యను ప‌రిష్క‌రించాలి.

4) గ్రామ కంఠాల సమస్యను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాలి.

5) అసంబద్ధమైన ఎఫ్‌ఎస్‌ఐ విధానం తొల‌గించాలి.

6) అధికారుల అవినీతిపై చర్యలు తీసుకోవాలి.

7) అమరావతి అభివృద్ధిలో రైతులను భాగస్వాముల‌ను చేయాలి.

8) స్వయం ఉపాధి రూపకల్పనలో వైఫల్యాల‌ను ప‌రిష్క‌రించాలి.

9) ప్రజాప్రతినిధులు రైతు జెఎసితో రానున్న పదిరోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలి.

10) ప్రతి రెండు నెలలకు రైతు జెఎసితో సంయుక్త సమావేశం జరపాలి.