Begin typing your search above and press return to search.

వైసీపీలోకి కీలక నాయకుడు ఎంట్రీ ?

వైసీపీ తన రాజకీయ వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. గతంలో చేసిన పొరపాట్లు చేయకూడని కూడా భావిస్తోంది అని అంటున్నారు.

By:  Satya P   |   16 March 2026 11:00 PM IST
వైసీపీలోకి కీలక నాయకుడు ఎంట్రీ  ?
X

వైసీపీ తన రాజకీయ వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. గతంలో చేసిన పొరపాట్లు చేయకూడని కూడా భావిస్తోంది అని అంటున్నారు. 2024 వరకూ చూస్తే కేవలం జగన్ ఇమేజ్ తోనే ఎన్నికల్లో నెగ్గుతామని అతి ధీమాతో ఉంటూ వచ్చింది. కానీ ఇపుడు అలా కాదు పార్టీకి జిల్లాలలో నియోజకవర్గాలలో బలమైన నేతలు ఉండాలని ఆలోచిస్తోంది. అదే సమయంలో వైసీపీకి క్యాడర్ కూడా అంతే ముఖ్యమని నిబద్ధతతో నడించే వారికి పూర్తి భరోసా ఇస్తూ పార్టీ పదవులు ఇస్తూ వారిని కలుపుకొని పోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని వివిధ కారణాల వల్ల విడిచి వెళ్ళిన వారిని తిరిగి వైసీపీ గూటికి చేర్చే ప్రయత్నాలు కూడా ముమ్మరం అయ్యాయని అంటున్నారు. అటూ ఇటూ సానుకూల సంకేతాలు కనుక ఉంటే వారికి తిరిగి పార్టీ కండువా కప్పడం ఖాయమని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

ప్రకాశంలో సీనియర్ నేత :

ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సీనియర్ గా పేరున్న వారు ఇండిపెండెంట్ గా కూడా ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చూపిన నేత అయిన ఆమంచి క్రిష్ణ మోహన్ తిరిగి వైసీపీ వైపు వచ్చేందుకు చూస్తున్నారు అన్నది ఒక ప్రచారంగా ఉంది. ఈ మధ్యనే ఆయన గుంటూరు వెళ్ళి మరీ మాజీ మంత్రి అంబటి రాంబాబుని పరామర్శించారు. ఈ సందర్భంగా ఈ ఊహాగానాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఆమంచి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని అంతా అనుకుంటూ వస్తున్నారు.

కారణాలు ఇవే :

ప్రకాశం జిల్లాలో వైసీపీ ప్రస్తుతం నాయకుల కొరతను ఎదుర్కొంటోంది. అదే సమయంలో పార్టీలో బలంగా ఉన్న నాయకులు 2024 ఎన్నికల ముందు బయటకు వెళ్ళిపోయారు. మరి కొందరు పార్టీ ఓటమి తరువాత పార్టీని వీడి వెళ్లారు. దీంతో ఒక విధంగా చెప్పాలీ అంటే ప్రకాశం తగ్గిన జిల్లాగా ఒంగోలు ఉంది అన్న భావన అందరిలో ఉంది. వీరిలో వివాదరహితమైన నాయకులు, అధినాయకత్వం మీద ఈ రోజుకీ విశ్వాసం ఉంచుతూ తమకు స్థానికంగా కలసి రాక పార్టీ మారిన వారిని తిరిగి వైసీపీలో చేర్చుకోవడానికి పార్టీ పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు.

ఇక ఆమంచి క్రిష్ణ మోహన్ విషయానికి వస్తే ఆయనకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. 2019 ఎన్నికల్లో అక్కడే ఆయనకు వైసీపీ టికెట్ ఇచ్చింది. కానీ టీడీపీ నుంచి కరణం బలరాం గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరిపోయారు. దాంతో అప్పటి నుంచి ఆమంచికి పార్టీకి మధ్య గ్యాప్ వచ్చింది. ఇక ఆమంచికి పర్చూరు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంతో ఆయన అది ఇష్టం లేక ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక ఇపుడు చూస్తే చీరాల ఇంచార్జిగా తనకు తిరిగి అవకాశం ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు ఆమంచి సుముఖంగా ఉన్నారు అన్న ప్రచారం ఒకటి సీరియస్ గానే సాగుతోంది అని అంటున్నారు.

వైసీపీ గ్రీన్ సిగ్నల్స్ :

ఇక చూస్తే చీరాలలో ఇంచార్జిగా ఉన్న కరణం కుటుంబం అయితే రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరని అంటున్నారు. మరో వైపు కరణం బలరాం తన వారసుడు కరణం వెంకటేష్ ఫ్యూచర్ కోసం చూస్తున్నారు. వైసీపీ అయితే ఆయన్ని అద్దంకి పంపించాలని చూస్తోంది అని అంటున్నారు. మరి ఆయనకు అది ఇష్టం ఉందా లేదా అన్నది వేరే విషయం కానీ చీరాలలో మాత్రం కొత్త నాయకత్వాన్ని తీసుకుని రావాలని వైసీపీ హై కమాండ్ ఇప్పటికే డిసైడ్ అయింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో చీరాలనే ఆమంచి కూడా కోరుకోవడంతో వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్స్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. అన్నీ కుదిరితే కనుక తొందరలోనే ఆమంచి వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.