Begin typing your search above and press return to search.

ఆమంచి డిసైడ్ అయిపోయినట్లే...ఆ పార్టీలోకే ?

ప్రకాశం జిల్లాకి చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ తన రాజకీయ భవిష్యత్తు గురించి సుదీర్ఘంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం సాగుతోంది.

By:  Satya P   |   3 July 2026 9:00 AM IST
ఆమంచి డిసైడ్ అయిపోయినట్లే...ఆ పార్టీలోకే  ?
X

ప్రకాశం జిల్లాకి చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ తన రాజకీయ భవిష్యత్తు గురించి సుదీర్ఘంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయన చీరాల నుంచి రెండు సార్లు గెలిచారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2024 నాటికి కాంగ్రెస్ లో చేరి ఎక్కువ ఓట్లే సంపాదించారు. ఆయనకు చీరాలలో సొంత బలం ఉండడమే అందుకు కారణం. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆమంచి మంచి పార్టీ చూసుకుని అందులో చేరాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఆయన ఏ పార్టీలో చేరాలన్న దాని మీద చాలా కాలంగా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

వైసీపీలో అంటూ :

ఇక ఆమంచి క్రిష్ణ మోహన్ గతంలో వైసీపీలో కొనసాగారు. కాబట్టి మళ్లీ ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారు అని ప్రచారం అయితే సాగుతూ వచ్చింది. దానికి తోడు ఆయనను తిరిగి పార్టీలోకి తెచ్చి చీరాల టికెట్ ఇవ్వాలని అక్కడ ఉన్న కరణం బలరాం తనయుడుని వేరే సీటుకు బదిలీ చేయాలని వైసీపీ ఆలోచిస్తోంది అని కూడా ప్రచారం సాగింది. ఆమంచి కూడా ఫ్యాన్ నీడకే తన ప్రయాణం అని నిర్ణయించుకున్నారు అని కూడా అనుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రకాశం జిల్లా రాజకీయాలు మారాయని అని అంటున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన శక్తివంచన లేకుండా పార్టీని అభివృద్ధి చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన జిల్లాలో బలమైన నాయకులను జనసేన వైపు తిప్పాలని చూస్తున్నారు.

ఆమంచి కోసం కూడా :

ఈ నేపధ్యంలో బలమైన నేతగా చీరాల నియోజకవర్గంలో తనకంటూ ఓటు షేర్ కలిగి ఉన్న ఆమంచి క్రిష్ణ మోహన్ తోనూ జనసేన నేతలు సంప్రదింపులు జరిపారు అని అంటున్నారు. ఆయన పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు అని అంటున్నారు. ఇక ఆమంచి కూడా జనసేనలో చేరేందుకు మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే తనకు చీరాలలో బలం సొంతంగా ఉంది, దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్లామర్ ఆయన ఇమేజ్ తోడు అయితే కచ్చితంగా గెలిచేందుకు వీలు కలుగుతుందని కూడా లెక్క వేస్తున్నారు అని అంటున్న్నారు.

సీటు గ్యారంటీ :

మరో వైపు చూస్తే ఈసారి జిల్లాలో ఎక్కువ సీట్లు తీసుకుని జనసేన పోటీ చేయాలని అనుకుంటోందని చెబుతున్నారు. ఈ లెక్కన బలమైన నేతలను జనసేన కోరుకుంటోంది. వారి చేరికతో పార్టీ పటిష్టం అయితే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకోవాలని భావిస్తోంది. ఆ విధంగా ఆమంచి వంటి వారికి గ్యారంటీగా సీటు దక్కుతుందని అంటున్నారు. దాంతో ఆమంచి జనసేన గాజు గ్లాస్ పట్టుకునేందుకే రెడీ అవుతున్నారు అని అంటున్నారు. మరి ఆ ముహూర్తం ఎపుడు అన్నది అయితే చూడాల్సి ఉంది.