Begin typing your search above and press return to search.

ఆమంచి రూట్ మార్చేశారు.. స‌క్సెస్ అయ్యేనా.. ?

ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.. చీరాల మాజీ ఎమ్మెల్యే. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.

By:  Garuda Media   |   1 Oct 2026 5:00 AM IST
ఆమంచి రూట్ మార్చేశారు.. స‌క్సెస్ అయ్యేనా.. ?
X

ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.. చీరాల మాజీ ఎమ్మెల్యే. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు. ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్‌పార్టీలోనే ఉన్నారు. అయితే.. గ‌తానికి భిన్నంగా ఇప్పుడు రూట్ మార్చేశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఒక‌ప్పుడు నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు.. త‌న ఇంట్లోనే పంచాయ‌తీలు పెట్టిన ఆమంచి.. ఇప్పుడు న్యాయ పోరాటాల‌కు దిగారు. ఆయ‌న హైకోర్టులో పిటిష‌న్ల‌పై పిటిష‌న్లు వేస్తూ.. స‌మ‌స్య‌లు వెలుగులోకి తీసుకువ‌స్తు న్నారు.

ప్ర‌స్తుతం ఇసుక‌, మైనింగ్ అక్ర‌మాలు జోరుగా సాగుతున్నాయంటూ.. హైకోర్టులో నాలుగు పిటిష‌న్లు ఆమంచి నేరుగా వేశారు. దీనిలో ఆయ‌న పేరును కూడా ప్ర‌స్తావించారు. అక్ర‌మాల‌ను అరిక‌ట్టాల‌ని.. ఆయ‌న కోరుతున్నారు. దీనిని హైకోర్టు కూడా సీరియ‌స్‌గానే తీసుకుంది. ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ ప్ర‌త్యేక శైలి ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌న్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌. ప్ర‌జ‌ల‌ను ఆద‌రువుగా చేసుకుని రాజ‌కీయాలు చేసిన ఆమంచి ఇప్పుడు కోర్టుకు వెళ్లడం కొంత వ‌ర‌కు కొత్త‌గానే ఉంది.

ఇదే స‌మ‌యంలో ఆయ‌న వేస్తున్న అడుగులు ప్ర‌జ‌ల్లోకి చేరుతాయా ? చేరినా..ఆయ‌న‌కు అనుకూలంగా మారుతాయా ? అనేది ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో ఆమంచి వ‌ర్గం పెద్ద‌గా దూకుడు లేదు. పైగా అన్న‌ద‌మ్ముల మ‌ధ్యే రాజ‌కీయ విభేదాలు న‌డుస్తున్నాయి. ఆమంచి స్వాములు.. జ‌న‌సేన‌ను వీడిన త‌ర్వాత‌.. ఇప్పుడు ఏ పార్టీలోనూ చేర‌లేదు. దీంతో ఆయ‌న సైలెంట్ అయ్యారు. ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కాంగ్రెస్‌లోనే ఉన్నా.. పెద్ద‌గా యాక్టివ్ పాలిటిక్స్ చేయ‌డం లేదు.

ఈ క్ర‌మంలో ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించ‌డం.. అక్ర‌మాల‌పై నిల‌దీయ‌డం వంటివి రాజ‌కీయంగా ఆమంచికి ఏమేర కు మేలు చేస్తాయ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆమంచి.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల్సిన అవ‌సరం ఉంద‌ని ఆయ‌న అనుచ‌రులు కోరుతున్నారు. కానీ, వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఆమంచి ఈ విష‌యంలో వెనుక‌డుగు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి న్యాయ పోరాటాలు ఏమేర‌కు ఆయ‌న‌కు ఓటు బ్యాంకును పెంచుతాయో చూడాలి.