బిగ్ బాస్ ఎంట్రీ.. మాజీ డీజీపీ కుమారుడి మృతి కేసులో కీలక పరిణామం!
ఈ నేపథ్యలో అక్టోబర్ 16న హర్యానాలోని పంచకులలో అతని ఇంటి నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున పోలీసులు మొదట అఖీల్ మరణంపై దర్యాప్తు ప్రారంభించారు.
By: Raja Ch | 9 Nov 2025 11:00 AM ISTపంజాబ్ లో మాజీ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహమ్మద్ ముస్తాఫా కుమారుడు అఖిల్ అక్తార్ మృతి కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముస్తఫా.. ఆయన భార్య, మాజీ మంత్రి రజియా సుల్తానాపై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమయంలో ఈ సంచలన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ కేసు ఇప్పుడు బిగ్ బాస్ చేతుల్లోకి వెళ్లింది!
అవును.... పంజాబ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) మహ్మద్ ముస్తఫా కుమారుడు అఖీల్ అక్తర్ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చేతుల్లోకి చేరుకుంది. ఈ నేపథ్యంలో... పంజాబ్ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తఫా, ఆయన భార్య, మాజీ మంత్రి రజియా సుల్తానాతో పాటు ఇతర కుటుంబ సభ్యులపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
తాజాగా దాఖలైన ఈ ఎఫ్ఐఆర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీబీఐ అధికారులు చెబుతోన్న వివరాల ప్రకారం.. అకీల్ అక్తర్ మరణం అనుమానాస్పద పరిస్థితులలో జరిగిందని, ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ వివాదం బయటపడిందని తేలిందని జాతీయ మీడియా నివేదించింది!
వాస్తవానికి తన మరణానికి దాదాపు రెండు నెలల ముందు ఆగస్టులో అఖీల్ తన తండ్రిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు! ఆ వీడియోలో.. తన తండ్రి, అతని భార్య అక్రమ సంబంధం కలిగి ఉన్నారని ఆరోపించాడు. అలాగే.. తన తల్లి, సోదరిపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశాడు. వీరంతా కలిసి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు.
ఈ నేపథ్యలో అక్టోబర్ 16న హర్యానాలోని పంచకులలో అతని ఇంటి నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున పోలీసులు మొదట అఖీల్ మరణంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేసు తీవ్రత దృష్ట్యా హర్యానా ప్రభుతం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో తాజాగా ఈ కేసులో సీబీఐ అఖీల్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసింది!
కాగా... తన కుమారుడు అఖిల్ అక్తార్ మృతి కేసు సంచలనం సృష్టించిన నేపథ్యంలో... దీనిపై ముస్తాఫా స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తన కుమారుడు గత 18 ఏళ్లుగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని, అది ఓవర్ డోస్ కావడంతోనే మృతి చెందాడని తెలిపారు.
