ఇకపై వధువులకు కానుకగా తుపాకులు, కత్తులు.. ఎక్కడో తెలిస్తే షాక్!
తాజాగా అఖిల భారత క్షత్రియ మహాసభ అధ్యక్షుడు అజయ్ ప్రతాప్ సింగ్ ఆడవాళ్ళ రక్షణ కోసం తల్లిదండ్రులు ఏం చేయాలో చెప్పారు.
By: Madhu Reddy | 27 Aug 2025 8:00 PM ISTచాలామంది తల్లిదండ్రులు.. కూతుళ్ళ పెళ్లి చేసేసి ఇక మన బాధ్యత అయిపోయింది అని చేతులు దులుపుకుంటారు. అంతేకాదు కోట్లకు కోట్ల కట్నాలు ఇచ్చి కూతుర్ని అత్తగారింటికి సాగనంపుతారు. కానీ తీరా అత్తగారింట్లో కూతురు పడే బాధలు అన్ని ఇన్నీ కావు.అయితే అందరి ఇళ్లలో ఇలా ఉంటుందని కాదు.. కొంతమంది మాత్రం ఇలాగే ఉంటున్నారు.. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెడితే చివరికి అత్తింట్లో పడే కష్టాలు ఎలా ఉంటాయో అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. కొంతమంది భర్తలు, అత్తమామలు, ఆడపడుచులు ఇంటికి వచ్చిన అమ్మాయిని చిత్రహింసలు పెడుతూ చివరికి సైలెంట్ గా చంపేసి మాకు ఏమీ తెలియదు అన్నట్లుగా ఉంటున్నారు. అయితే ఇలాంటి మహిళల చేతులకి ఆయుధాలు ఇవ్వాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అఖిల భారత క్షత్రియ మహాసభ అధ్యక్షుడు అజయ్ ప్రతాప్ సింగ్..
తాజాగా అఖిల భారత క్షత్రియ మహాసభ అధ్యక్షుడు అజయ్ ప్రతాప్ సింగ్ ఆడవాళ్ళ రక్షణ కోసం తల్లిదండ్రులు ఏం చేయాలో చెప్పారు. అదేంటంటే చాలామంది మహిళలకు పెళ్లి చేసే సమయంలో వెండి, బంగారం,డబ్బులు,ఫ్లాట్లు ఇలా ఎన్నో కట్నంగా ఇస్తూ ఉంటారు.అయితే ఇవన్నీ ఇచ్చినా కూడా అత్తింట్లో కూతురు హ్యాపీగా ఉంటుందా అంటే అది కూడా జరగదు..అయితే కొంతమంది సంతోషంగా ఉంటే మరి కొంత మంది అత్తింట్లో ఎంతో హింసకు గురవుతూ ఈ విషయాలన్నీ తల్లిదండ్రులకు తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని చెప్పకుండా లోలోపలే కుమిలిపోతూ ఉంటారు.
అయితే ఇప్పటినుండి మహిళలకు పెళ్లి చేసే సమయంలో కట్న కానుకల కింద బంగారం, వెండి ఇచ్చే బదులు ఆయుధాలను కానుకలుగా ఇవ్వండి అంటూ అఖిల భారత క్షత్రియ మహాసభ అధ్యక్షుడు అయినటువంటి అజయ్ ప్రతాప్ సింగ్ చెప్పుకొచ్చారు. మహిళలకు ఇచ్చే ఈ ఆయుధాలు పెళ్లయ్యాక తమను తాము రక్షించుకోవడం కోసం ఉపయోగపడతాయి అని చెప్పుకొచ్చారు. అయితే ఆదివారం రోజు ఉత్తరప్రదేశ్ లోని గౌరీపూర్ మిట్లా గ్రామంలో జరిగిన కేసరియా మహా పంచాయత్ లో ఠాకూర్ వర్గాన్ని ఉద్దేశిస్తూ అఖిల భారత క్షత్రియ మహాసభ అధ్యక్షుడు అజయ్ ప్రతాప్ సింగ్ ఈ విషయాలు చెప్పుకొచ్చారు. అయితే పెళ్లిళ్లు చేసే సమయంలో వారికి కట్న కానుకలుగా బంగారం, డబ్బులు,వెండి ఇచ్చే బదులు వాళ్లను వాళ్ళు రక్షించుకోవడం కోసం ఈ ఆయుధాలు ఇవ్వడం చాలా మంచిది అని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో క్షత్రియ మహిళల ఆత్మరక్షణ కోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతిని పక్కన పెట్టారు.కానీ మళ్ళీ ఇప్పుడు ఆ పద్ధతిని తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక అజయ్ ప్రతాప్ సింగ్ మహిళల గురించి ఈ మాటలు మాట్లాడడానికి కారణం.. సమాజంలో ప్రస్తుతం మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలే.. మహిళలు తమను తాము రక్షించుకోగలడం కోసం వారికి శిక్షణ ఇవ్వాలని, శిక్షణ ఇవ్వకపోయినా కనీసం ఇలాంటి ఆయుధాలైనా ఇచ్చి రక్షించుకోమని చెప్పాలనేది ఆయన ఉద్దేశం..
