రన్‌వే పక్కన కూర్చొని మూత్ర విసర్జన.. పైలట్ నవ్వులు, నెటిజన్ల రియాక్షన్లు
ఎయిర్‌పోర్ట్ రన్‌వే పక్కన జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By: A.N.Kumar | 2 Sept 2025 2:20 PM ISTఎయిర్‌పోర్ట్ రన్‌వే పక్కన జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైలట్ కాక్‌పిట్‌లోంచి రికార్డ్ చేసినట్లు చెప్పబడుతున్న 9 సెకన్ల వీడియోలో, తెల్లని కుర్తా-పజామా ధరించిన ఓ వ్యక్తి విమానానికి కొద్ది మీటర్ల దూరంలో గడ్డిపైన కూర్చొని మూత్ర విసర్జన చేస్తున్నాడు.
ఈ దృశ్యాన్ని చూసి పైలట్ గట్టిగా నవ్వుతుండగా ఆ విమానంలో ఎక్కేందుకు ప్రయాణికులు లైన్‌లో నిలబడి కనిపిస్తున్నారు.
సంబంధిత వీడియో X లో వైరల్ అవుతూ.. ఇప్పటివరకు 2.85 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు “ఇండియాలో మాత్రమే ఇలాంటివి సాధ్యం” అంటూ సరదాగా కామెంట్లు చేస్తుండగా, మరికొందరు విమానాశ్రయ భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ప్రజా మరుగుదొడ్లు సరిగా అందుబాటులో లేకపోవడమే కారణమని కొందరు యూజర్లు ఆ వ్యక్తిని సమర్థిస్తున్నారు. అయితే, అంత ముఖ్యమైన రన్‌వే పక్కన ఇలా ఎవరైనా నిర్బంధం లేకుండా ఉండటం ఎలా సాధ్యమైందని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆ వ్యక్తి ఎవరు? ఘటన ఎక్కడ జరిగింది? అన్నది అధికారికంగా ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ వీడియో భద్రతా వ్యవస్థలపై చర్చను రేకెత్తించింది.
