Begin typing your search above and press return to search.

ఏఐ రేసులో 'మెమరీ' సెగ.. మైక్రోసాఫ్ట్, గూగుల్‌ను వణికిస్తున్న కొత్త సంక్షోభం!

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు ఏఐ విప్లవం వైపు పరుగులు పెడుతుంటే మరోవైపు టెక్ దిగ్గజాలకు ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి.

By:  A.N.Kumar   |   28 Dec 2025 11:00 PM IST
ఏఐ రేసులో మెమరీ సెగ.. మైక్రోసాఫ్ట్, గూగుల్‌ను వణికిస్తున్న కొత్త సంక్షోభం!
X

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు ఏఐ విప్లవం వైపు పరుగులు పెడుతుంటే మరోవైపు టెక్ దిగ్గజాలకు ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏఐ అంటేకేవలం సాఫ్ట్ వేర్ లేదా స్మార్ చిప్స్ అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు అసలు యుద్ధం ‘మెమొరీ’ చుట్టూ సాగుతోంది. మైక్రోసాప్ట్, గూగుల్ వంటి గ్లోబల్ జెయింట్స్ ఇప్పుడు మెమరీ చిప్స్ కొరతతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

ఎగ్జిక్యూటివ్ ల ప్రాణాల మీదకు తెచ్చిన కొరత!

సిట్రిని రీసెర్చ్ నివేదిక ప్రకారం.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ ప్రొక్యూర్ మెంట్ అధికారులను అత్యవసరంగా దక్షిణకొరియాకు పంపించారు. సామ్ సాంగ్, ఎస్.కే హైనీక్స్ వంటి సరఫరాదారుల నుంచి మెమరీని ఎలాగైనా దక్కించుకోవాలని.. లేదంటే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని యాజమాన్యాలు అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం.

ఇప్పటికే తగినంత మెమరీ సరఫరాను భద్రపరచడంలో విఫలమైనందుకు గూగుల్ కొంతమంది అధికారులను తొలగించినట్లు తెలుస్తోంది. ముందస్తు ఒప్పందాలు లేకపోవడంతో సంస్థలో ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే పరిస్థితి నెలకొంది. సరఫరాదారులతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ లు అసహనంతో మీటింగ్ నుంచి వాకౌట్ చేసిన సంఘటనలు కూడా ఈ ఉత్కంఠకు నిదర్శనం.

అసలు ఏమిటీ హెచ్.బీఎం సంక్షోభం?

ఏఐ మోడళ్లు పెరిగే కొద్దీ వాటికి డేటాను వేగంగా ప్రాసెస్ చేసే శక్తి కావాలి. దీనికి సాధారణ మెమరీ సరిపోదు. హై బ్యాండ్ విత్ మెమొరీ , అధునాతన డీఆర్ఎఎం చిప్స్ మాత్రమే ఈ భారాన్ని మోయగలవు.

ప్రధాన కారణాలు

ప్రపంచవ్యాప్తంగా ఈ చిప్స్ ను తయారు చేసేది కేవలం మూడు కంపెనీలే.. ‘ఎస్.కే హైనిక్స్’, సామ్ సంగ్, మైక్రాన్.2 ఈ కంపెనీల 2025 చివరి వరకూ ఉండే ఉత్పత్తి సామర్థ్యం ఇప్పటికే బుక్ అయిపోయింది. భవిష్యత్తు అవసరాలను ముందే అంచనావేసి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ చేసుకోకపోవడం టెక్ దిగ్గజాలకు శాపంగా మారింది.

మారిన కొనుగోలు వ్యూహాలు

గతంలో మెమొరీ చిప్స్ కొనుగోలు అనేది సాధారణ పరిపాలనా వ్యవహారంగా ఉండేది. కానీ ఇప్పుడు టెక్ కంపెనీలు తమ అధికారులను శాశ్వతంగా కొరియా, తైవాన్, సింగపూర్ లలోనే ఉంచుతున్నాయి. ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉన్న వారికే సేకరణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ధర ఎంతైనా పర్లేదు మొమరీ పంపండి అంటూ ఓపెన్ ఎండ్ ఆర్డర్లు ఇస్తున్నారు.

2027 వరకూ తప్పదా?

అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనా ప్రకారం.. ఈ మొమరీ కొరత 2027 వరకూ కొనసాగే అవకాశం ఉంది. ఒకప్పుడు చౌకగా లభించిన మొమరీ.. ఇప్పుడు యుద్ధాల్లో ఉపయోగించే వ్యూహాత్మక ఆయుధంగా మారిపోయింది. ఏఐ రేసులో విజేతగా నిలవాలంటే కేవలం తెలివైన అల్గారిథమ్స్ ఉంటే సరిపోదు.. వాటిని నడిపించే 'జ్ఞాపకశక్తి' లాంటి మెమొరీ కూడా ఉండాలి. మెమరీ లేకపోతే ట్రిలియన్ల డాలర్ల పెట్టుబడులు వృధా అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.