Begin typing your search above and press return to search.

తాజా రిపోర్టు: హైదరాబాద్ లో జాబ్స్ ఎంత పెరిగాయంటే?

ఏఐ ఎంట్రీతో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినట్లుగా జరిగే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్న విషయం తాజాగా విడుదలైన ఒక రిపోర్టు స్పష్టం చేస్తోంది.

By:  Garuda Media   |   2 Sept 2025 12:00 PM IST
తాజా రిపోర్టు: హైదరాబాద్ లో జాబ్స్ ఎంత పెరిగాయంటే?
X

ఏఐ ఎంట్రీతో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినట్లుగా జరిగే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్న విషయం తాజాగా విడుదలైన ఒక రిపోర్టు స్పష్టం చేస్తోంది. పని చేయాలే కానీ.. చేయించుకునేందుకు బోలెడంతమంది సిద్ధంగా ఉన్న విషయం అర్థమవుతుంది. తాజాగా వెల్లడైన నౌక్రీ జాబ్ స్పీక్ రిపోర్టు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఈ రిపోర్టులో హైదరాబాద్ మహానగరంలో ఉద్యోగ అవకాశాలు పెరిగిన విషయాన్ని స్పష్టం చేసింది.

ఏఐ.. మెషిన్ లెర్నింగ్ ఉద్యోగాలకు గిరాకీ పెరిగిందని వెల్లడించిన రిపోర్టు.. ఇందులో బీమా రంగంలో 24 శాతంతో అగ్రస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానంలో అతిథ్యంలో 22 శాతం.. స్థిరాస్తిలో 18 శాతం మేర ఉద్యోగాలు పెరిగినట్లుగా వెల్లడైంది. బీపీవో.. ఐటీఈఎస్.. విద్య.. చమురు-గ్యాస్, ఎఫ్ఎంసీజీ రంగాల్లోనూ ఉద్యోగాలకు సానుకూలంగానే ఉన్నట్లుగాపేర్కొంది.

నియామకాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్న విషయం వెలుగు చూసింది. ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ మహానగరం పది శాతం పెరుగుదల కనిపించిన విషయం వెల్లడైంది. యూనికార్న్ నియామకాల్లోనూ వ్రద్ధి రేటు 45 శాతం ఉండటం గమనార్హం. టెక్నాలజీకి సంబంధించి పెరిగిన ఉద్యోగ అవకాశాల్ని చూస్తే.. ఏఐ.. ఎంఎల్ నిపుణుల నియామకాలు 54 శాతం పెరగ్గా.. ఇందుకు భిన్నంగా ఐటీ.. సాఫ్ట్ వేర్ సేవల రంగంలో నియామకాలు 6 శాతం తగ్గటం గమనార్హం.

ఐటీ యూనికార్న్ లో పది శాతం పెరగ్గా.. బ్యాంకింగ్.. ఆర్థిక సేవల రంగాల్లో 11 శాతం ఉద్యోగాలు తగ్గాయి. టెలికంలోనూ తగ్గుదల పదమూడు శాతం ఉంది. వాహన రంగంలో మూడు శాతం వరకు నియామకాలు క్షీణించాయి. ఫ్రెషర్లకు.. మూడేళ్ల అనుభవం ఉన్నోళ్లకు ఉద్యోగ అవకాశాలు 7 శాతం పెరిగినట్లుగా రిపోర్టు వెల్లడించింది. ఉద్యోగాల లభ్యత తగ్గిందని చెబుతున్న వేళ.. ఈ రిపోర్టు ఆసక్తికరంగా మారింది.