Begin typing your search above and press return to search.

టెకీల్లో పెరుగుతున్న టాలెంట్.. సినిమా రేంజ్ లో పోయిన ఫోన్ తెచ్చుకోవడమే కాదు..

విషయంలోకి వెళ్తే.. ముంబైలోని ఘాట్ కోపర్ ప్రాంతానికి చెందిన అంకిత గుప్తా అనే ఒక టెకీ గతవారం తన ఫ్యామిలీతో కలిసి ఆమె తీర్థయాత్రల కోసం వారణాసికి వెళ్ళింది.

By:  Madhu Reddy   |   9 Jan 2026 4:00 AM IST
టెకీల్లో పెరుగుతున్న టాలెంట్.. సినిమా రేంజ్ లో పోయిన ఫోన్ తెచ్చుకోవడమే కాదు..
X

పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఈ టెక్నాలజీని వాడుకోవడంలో చాలామంది దిట్ట అని నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ టెక్నాలజీని సరైన దారిలో ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు అని ఎంతో మంది టెకీలు నిరూపిస్తున్నారు కూడా.. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న బెంగళూరుకు చెందిన పంకజ్ తన్వర్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిని, ట్రాఫిక్ లో స్టంట్ డ్రైవింగ్ చేస్తూ రెచ్చిపోతున్న వారిని, హెల్మెట్ లేకుండా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్న వారిని చూసి చూసి విసిగిపోయి.. డైలీ పెట్టుకునే హెల్మెట్ ను ఏఐ ఉపయోగించి కదిలే ట్రాఫిక్ పోలీసుగా మార్చేశారు. అంటే ఈ హెల్మెట్ పెట్టుకొని మనం బయటకెళ్తే ట్రాఫిక్ ఉల్లంఘనలు, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ప్రయాణికులను ఇట్టే గుర్తుపట్టి వారి ఫోటోలను క్యాప్చర్ చేయడమే కాకుండా సమాచారాన్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. ఇక ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది ఈ ఆవిష్కరణ.

ఇకపోతే ఇక్కడ మరో టెకీ యువతి టెక్నాలజీకి తగ్గట్టుగా తన తెలివితేటలను ఉపయోగించి సినిమా స్టైల్ లో పోగొట్టుకున్న తన ఫోను తిరిగి దక్కించుకోవడమే కాకుండా ఒక పోలీస్ అధికారి నిర్లక్ష్యపు తీరుకి సస్పెండ్ కూడా చేయించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

విషయంలోకి వెళ్తే.. ముంబైలోని ఘాట్ కోపర్ ప్రాంతానికి చెందిన అంకిత గుప్తా అనే ఒక టెకీ గతవారం తన ఫ్యామిలీతో కలిసి ఆమె తీర్థయాత్రల కోసం వారణాసికి వెళ్ళింది. అయితే అసీఘాట్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎవరో ఆమె ఫోను దొంగతనం చేశారు ఇంకేముంది అందరిలాగే ఆమె కూడా పోలీసులను ఆశ్రయించి, తాను పోగొట్టుకున్న మొబైల్ గురించి కంప్లైంట్ చేసింది. అయితే పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో తన స్నేహితుల సహాయంతో ఆ ఫోన్ లొకేషన్ గుర్తించింది. అయితే ఆ ఫోన్ మండుఆదీహ్ లో ఒక ఇంట్లో తన ఫోన్ ఉన్నట్టు ట్రాకింగ్ ద్వారా గుర్తించి పోలీసులను అప్రమత్తం చేసింది.

వెంటనే ఆ లొకేషన్ కి వెళ్లిన పోలీసులు ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకోవడమే కాకుండా తనిఖీల్లో అక్కడ మరో 12 ఫోన్లు గుర్తించడం గమనార్హం. ఈ పరిణామం తర్వాత పోలీస్ డిప్యూటీ కమిషనర్ అంతర్గత విచారణకు ఆదేశించి.. అసీఘాట్ పోలీస్ ఔట్ పోస్ట్ ఇన్చార్జి విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆయనపై సస్పెండ్ కూడా విధించారు. మొత్తానికైతే ఈమధ్య టెకీలు టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్న పనులు సినిమాలను తలపిస్తున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు సదరు యువతిపై ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.