Begin typing your search above and press return to search.

భారత్ పై పాక్ 'ప్రాక్సీ' మాటలు... గట్టిగా గడ్డిపెట్టిన ఆఫ్గన్!

ఈ క్రమంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ పై చేసిన ఆరోపణలను ఆఫ్గన్ ఖండించింది.

By:  Raja Ch   |   22 Oct 2025 2:54 PM IST
భారత్ పై పాక్ ప్రాక్సీ మాటలు... గట్టిగా గడ్డిపెట్టిన ఆఫ్గన్!
X

పాకిస్థాన్‌ - అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో కొన్ని రోజుల క్రితం వరకూ ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో అనేక మంది సైనికులతో పాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ పై చేసిన ఆరోపణలను ఆఫ్గన్ ఖండించింది.

అవును... ఆఫ్గాన్ నిర్ణయాలు కాబూల్ లో కాకుండా న్యూఢిల్లీలో తీసుకుంటున్నారని.. ఆఫ్గన్ తాలిబన్లు న్యూఢిల్లీ తరపున పాకిస్థాన్ పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నారని ఖవాజా ఆసిఫ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆఫ్గనిస్తాన్ రక్షణ మంత్రి మొహమ్మద్ యాకూబ్ స్పందిస్తూ... పాకిస్తాన్ ఆరోపణలు నిరాధారమైనవి, ఎట్టిపరిథితుల్లోనూ ఆమోదయోగ్యం కానివని అన్నారు. న్యూఢిల్లీతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి కాబూల్ ఎదురుచూస్తుందని నొక్కి చెప్పారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఆయన.. భారత్ పై పాకిస్తాన్ ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఆఫ్గాన్ విధానంలో మా భూభాగాన్ని ఇతర దేశాలపై ఉపయోగించడం ఎప్పుడూ ఉండదని తెలిపారు. తాము భారతదేశంతో స్వతంత్ర దేశంగా సంబంధాలను కొనసాగిస్తామని.. మా జాతీయ ప్రయోజనాల చట్రంలో ఆ సంబంధాలను బలోపేతం చేస్తామని తాలిబన్ వ్యవస్థాపకుడు దివంగత ముల్లా ఒమర్ కుమారుడు యాకూబ్ అన్నారు.

భారత్ పై పాక్ 'ప్రాక్సీ' మాటలు... గట్టిగా తగులుకున్న ఆఫ్గన్!

పాకిస్థాన్‌ - అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో కొన్ని రోజుల క్రితం వరకూ ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో అనేక మంది సైనికులతో పాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఖతర్, టర్కీ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ పై చేసిన ఆరోపణలను ఆఫ్గన్ ఖండించింది.

అవును... ఆఫ్గాన్ నిర్ణయాలు కాబూల్ లో కాకుండా న్యూఢిల్లీలో తీసుకుంటున్నారని.. ఆఫ్గన్ తాలిబన్లు న్యూఢిల్లీ తరపున పాకిస్థాన్ పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నారని ఖవాజా ఆసిఫ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆఫ్గనిస్తాన్ రక్షణ మంత్రి మొహమ్మద్ యాకూబ్ స్పందిస్తూ... పాకిస్తాన్ ఆరోపణలు నిరాధారమైనవి, ఎట్టిపరిథితుల్లోనూ ఆమోదయోగ్యం కానివని అన్నారు. న్యూఢిల్లీతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి కాబూల్ ఎదురుచూస్తుందని నొక్కి చెప్పారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఆయన.. భారత్ పై పాకిస్తాన్ ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఆఫ్గాన్ విధానంలో మా భూభాగాన్ని ఇతర దేశాలపై ఉపయోగించడం ఎప్పుడూ ఉండదని తెలిపారు. తాము భారతదేశంతో స్వతంత్ర దేశంగా సంబంధాలను కొనసాగిస్తామని.. మా జాతీయ ప్రయోజనాల చట్రంలో ఆ సంబంధాలను బలోపేతం చేస్తామని తాలిబన్ వ్యవస్థాపకుడు దివంగత ముల్లా ఒమర్ కుమారుడు యాకూబ్ అన్నారు.

ఒకప్పుడు ఇస్లామాబాద్‌ కు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడిన యాకూబ్.. పాకిస్తాన్‌ తో శాంతి ఒప్పందాన్ని కొనసాగించడానికి పరస్పర గౌరవం, నిబద్ధత కీలకమని నొక్కి చెప్పారు. ఖతార్, టర్కీ దాని అమలుకు సహాయం చేయాలని, దీన్ని పర్యవేక్షించాలని కోరారు.

భారత్ పై పాక్ వాదన!:

కాబూల్‌ తో తమ సంబంధాలు క్షీణించడానికి భారతదేశమే కారణమని పాకిస్తాన్ ఆరోపించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాలిబాన్ ప్రభుత్వం భారతదేశం ఒడిలో కూర్చుని, ఢిల్లీ కోసం ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఆరోపించారు. దీంతో... తన అంతర్గత వైఫల్యాలకు భారతదేశాన్ని నిందించడం పాకిస్తాన్ కి ఉన్న పాత అలవాటు అని భారత విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ఆరోపణలకు ప్రతిస్పందించారు.

ఆఫ్గనిస్తాన్ - పాకిస్తాన్ సంబంధాలు!:

ఇటీవల తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి.. భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాబూల్‌ లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత అక్టోబర్ 11న పాక్-ఆఫ్గన్ సరిహద్దుల్లో హింస చెలరేగింది. తాలిబన్లు పాకిస్తాన్‌ తో ఉన్న దక్షిణ సరిహద్దులోని కొన్ని ప్రాంతాలలో ప్రాణాంతక దాడిని ప్రారంభించారు. దీనితో ఇస్లామాబాద్ బలమైన ప్రతిస్పందన ఇచ్చింది.