ఆఫ్గాన్ నుంచి సీక్రెట్ గా ఫ్లైట్ లో అలా వచ్చిన టీనేజర్
అవును.. ఆఫ్గానిస్థాన్ కు చెందిన ఒక టీనేజర్ చేసిన పని అందరికి షాకిచ్చేలా చేసింది.
By: Garuda Media | 23 Sept 2025 9:59 AM ISTఅవును.. ఆఫ్గానిస్థాన్ కు చెందిన ఒక టీనేజర్ చేసిన పని అందరికి షాకిచ్చేలా చేసింది. కాసేపు టెన్షన్ పుట్టించిన ఈ కుర్రాడి దుస్సాహసం గురించి తెలిస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. సరదాగా చేసినట్లుగా చెబుతున్న ఈ వ్యవరంలో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాల మీదకు వస్తుంది. ఇంతకూ ఈ టీనేజర్ చేసిందేంటి? అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..
అఫ్గాన్ రాజధాని కాబోల్ కు చెందిన పదమూడేళ్ల బాలుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. విమానంలో రహస్యంగా ప్రవేశించి..ప్రయాణించాలని భావించాడు.ఇందులో భాగంగా కాబోల్ ఎయిర్ పోర్టులోకి రహస్యంగా ప్రవేశించిన అతను..కేఏఎం విమానయాన సంస్థకు చెందిన విమానంలోకి రహస్యంగా ప్రవేశించాడు. విమానం వెనుక వైపు ఉండే.. సెంట్రల్ ల్యాండింగ్ గేర్ లోపలకు వెళ్లాడు. అక్కడే నక్కి కూర్చున్నాడు.
మరి.. ఇంత చేస్తున్న ఈ కుర్రాడిని అక్కడి గ్రౌండింగ్ స్టాఫ్ ఎందుకు చూడలేదో..? వారి కళ్లుగప్పి విమానంలో వెనుక భాగంలో రహస్యంగా కూర్చుండిపోయాడు. దాదాపు రెండు గంటల జర్నీ అనంతరం ఉదయం పదకొండు గంటల వేళలో ఢిల్లీ ఎయిర్ పోర్టులో సదరు ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది. ఆ టైంలో విమానం లోపల నుంచి బయటకు వచ్చిన అతను. అటూ ఇటూ తిరుగుతున్న వైనాన్ని మన భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అతను అఫ్గాన్ లోని కుందూజ్ నగరానికి చెందిన బాలుడిగా గుర్తించారు. కాబూల్ విమానాశ్రయంలోకి రహస్యంగా చొరబడి.. ఫ్లైట్ వెనుక ఉన్న సెంట్రల్ ల్యాండిగ్ గేర్ లోపలకు వెళ్లానని.. అక్కడే కూర్చొండిపోయినట్లుగా చెప్పాడు. ఇదంతా కూడా సరదాగా చేసినట్లుగా పేర్కొన్నాడు. అతడ్ని మనోళ్లు కాసేపు ప్రశ్నించి.. అనంతరం అదే విమానంలో అఫ్గాన్ కు పంపించేశారు. సరదా కోసం పెద్ద దుస్సాహసం చేసిన ఈ కుర్రాడి పని గురించి తెలిసుకున్న వారు మాత్రం షాక్ తింటున్నారు.
