Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. భారత్ గడ్డపై రొనాల్డో..?

క్రిస్టియానో రొనాల్డో అంటే ప్రపంచ దేశాల్లో తెలియని వారు ఉండరు. ఫుట్ బాల్ ఆటలో అగ్రగామిగా నిలిచిన ఆటగాడు.

By:  Madhu Reddy   |   16 Aug 2025 11:29 AM IST
ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. భారత్ గడ్డపై రొనాల్డో..?
X

క్రిస్టియానో రొనాల్డో అంటే ప్రపంచ దేశాల్లో తెలియని వారు ఉండరు. ఫుట్ బాల్ ఆటలో అగ్రగామిగా నిలిచిన ఆటగాడు. ఈయన గ్రౌండ్ లో అడుగు పెట్టాడు అంటే గ్రౌండ్ అంతా మెరుపులే. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఫుట్ బాల్ ఆటల్లో మొదటి స్థానంలో ఉన్న ప్లేయర్ గా ఈయన పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు ప్రపంచంలో అన్ని రకాల ఆటలాడేవారు ఉంటారు. వీరందరిలోకెళ్లా అత్యంత ఎక్కువ ఫ్యాన్స్ కలిగి ఉన్నటువంటి ప్లేయర్ ఎవరు అంటే క్రిస్టియానో రొనాల్డో మాత్రమే.. అంతటి అగ్రశ్రేణి ఆటగాడు మన ఇండియాలో ఆడటానికి రాబోతున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే చరిత్రాత్మకంగా పిలువబడే ఆసియా ఛాంపియన్స్ లీగ్ 2 మ్యాచ్ లో fc గోవాతో ఆయన తలపడడానికి వస్తున్నట్టు సమాచారం.

అయితే సౌదీ అరేబియాకు చెందినటువంటి ఆల్ నస్రు తో పాటూ మరి కొంతమంది సూపర్ ప్లేయర్స్ శుక్రవారం ఆసియా సెకండ్ ఎంటైర్ క్లబ్ లోని గ్రూప్ డి లో ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ లో ఖజకిస్తాన్ కు చెందినటువంటి ఇస్టీ క్లోల్, ఇరాక్ కు చెందినటువంటి అల్ జావ్రతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 8 జట్టుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచినవారు రెండవ రౌండ్ కు చేరుకోబోతున్నారు. అయితే ఇది నిజంగా ఎఫ్ సి గోవాకు జీవితంలో ఒక మంచి క్షణమని చెప్పవచ్చని క్లబ్ సీఈవో రవి పుష్కూరు అసోసియేటెడ్ ప్రెస్ తో అన్నారు. అయితే అల్ నస్రు, క్రిస్టియానో రోనాల్డోకు ఆదిత్యం ఇవ్వడం గొప్ప విషయమని.. భారత క్లబ్ ఫుట్ బాల్ చరిత్రలో అతిపెద్ద ఆట కాబోతుందని తెలుస్తోంది. ఎఫ్ సి గోవా జట్టు వారి సొంత మైదానంలోనే మ్యాచ్ ఏర్పాటు చేస్తున్నారని, ఈ ప్రణాళికలో భారత్ లో అడుగుపెట్టే అవకాశం ఉందని, ఇది కూడా 2025 సెప్టెంబర్ నుంచి 2026 మే వరకు జరగబోతుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ఐదుసార్లు భలోన్ డిఓఆర్ విజేత క్రిస్టియానో రొనాల్డో త్వరలోనే ఇండియాకు రాబోతున్నాడు అని తెలియడంతో చాలామంది ఫుట్ బాల్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఏఎఫ్సి ఛాంపియన్ షిప్ లీగ్ 2 డ్రా శుక్రవారం జరిగింది. దానిలో క్రిస్టియానో రోనాల్డో సారథ్యంలోని సౌదీ క్లబ్ అల్ నస్రు అలాగే ఇండియా ఐఎస్ఎల్ జట్టు ఎఫ్ సి గోవాతో పాటు ఇరాక్ చెందిన ఆల్ జాఫ్రా ఎఫ్ సి, ఖజకిస్తాన్ కు చెందిన ఎఫ్సి ఇస్టిక్లోల్ తో కలిసి డి గ్రూపులో చోటు దక్కించుకుంది. ఐఎస్ఎల్ 2024 -25 సీజన్ లో రెండవ స్థానంలో ముగించినటువంటి ఎఫ్సీ గోవా ఈ ఏడాది మే లో సూపర్ కప్ గెలిచి ప్లే ఆఫ్స్ రౌండ్ కు వెళ్ళింది. అంతేకాకుండా ఒమన్ క్లబ్ ఆల్ సిబ్ ను ఓడించి ఈ టోర్నమెంట్ లో చోటు సంపాదించుకుంది.

అలాగే సౌదీ ప్రో లీగ్ లో మూడవ స్థానంతో సరిపెట్టుకున్న అల్ నస్రూ, ఏఎఫ్సి ఛాంపియన్ లీగ్ ఎలైట్ కు అర్హత పొందలేకపోయింది. దీంతో వాళ్లు ఏసీఎల్ 2లో డి గ్రూపులో చేరిపోయారు. అయితే ఎఫ్ సి గోవా గడ్డపై జరిగే మ్యాచ్ లో క్రిస్టియానో రోనాల్డో ఆడతారా లేదా అనేది మనకు స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో మొత్తం కలిసి 32 జట్లు ఉంటే వెస్ట్ జోన్ లో 16 జట్లు, ఈస్ట్ జోన్ లో 16జట్లు 8 గ్రూపులుగా విభజించబడ్డాయి. ఇందులో ప్రతి గ్రూపు నుండి ప్రతి రెండు జట్లు రౌండ్ ఆఫ్ 16కి అర్హత పొందుతాయని తెలుస్తోంది.