Begin typing your search above and press return to search.

ఏసీబీలో హోంగార్డు.. జస్ట్ రూ.10 కోట్లు వెనకేశాడంతే

అసలేం జరిగిందంటే.. విజయనగరం జిల్లాలోని నడిపూరు గ్రామానికి చెందిన 43 ఏళ్ల శ్రీనివాస్ 2010లో జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా చేరాడు.

By:  Garuda Media   |   30 Jan 2026 9:45 AM IST
ఏసీబీలో హోంగార్డు.. జస్ట్ రూ.10 కోట్లు వెనకేశాడంతే
X

అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడైనా అవినీతి ఇట్టే కనిపిస్తుంది. ఇదేమీ పెద్ద విషయం కాదు.కానీ.. విజయనగరం జిల్లా పరిధిలోని ఒక హోంగార్డు అవినీతి భాగోతం వెలుగు చూసిన తెలుగు ప్రజలు ఔరా అనుకోకుండా ఉండలేని పరిస్థితి. ఇప్పటివరకు అవినీతికి పాల్పడుతూ అధికారులకు దొరికిపోయిన ఉదంతాలకు మించిన డ్రామా తాజా ఉదంతం సొంతంగా చెప్పాలి. అవినీతికి చెక్ పెట్టే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో పని చేసే ఒక చిరుద్యోగి కూడబెట్టిన అవినీతిసొమ్ము లెక్కలు కళ్లు బైర్లు కమ్మేలాంటి పరిస్థితి.

అసలేం జరిగిందంటే.. విజయనగరం జిల్లాలోని నడిపూరు గ్రామానికి చెందిన 43 ఏళ్ల శ్రీనివాస్ 2010లో జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా చేరాడు. కొన్నేళ్లుగా ఏసీబీ విభాగంలో పని చేస్తున్నాడు. ఉన్నతాధికారుల సూచనల్ని తూచా తప్పకుండా పాటించటం.. నమ్మకంగా పని చేసే విషయంలో తిరుగులేనట్లుగా వ్యవహరిస్తాడు. అయితే.. మనోడికి ఒక లెక్క ఉంది. అదేమంటే.. ఏసీబీ నిర్వహించే సోదాలకు సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగా సేకరించి.. ఎక్కడైతే తనిఖీలు నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారో.. సదరు అధికారికి ఆ సమాచారాన్ని అందించేవారు.

దీంతో అవినీతి తిమింగళాలైన పలువురు సబ్ రిజిస్ట్రార్లు.. తహసీల్దార్లు.. ఎంపీడీవోలు.. ఇతర అధికారులపై దాడులు నిర్వహించే వేళకు.. తప్పించుకునేలా చేసేవాడు. దీనికి భారీగా నగదును తీసుకునేవాడు. ఇలా గుట్టచప్పుడు కాకుండా ఇతడు చేసే దుర్మార్గాన్ని గుర్తించారు. గత ఏడాది నవంబరులో ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పలువురు అవినీతిపరులై అధికారులకు గుట్టుచప్పుడు కాకుండా సమాచారానని అందించినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు.

ఏళ్లకు ఏళ్లుగా ఏసీబీలో పని చేస్తునన ఇతడిపై తరచూ ఫిర్యాదులు రావటంతో ఉన్నతాధికారులు ఇతడిపై ప్రత్యేక ఫోకస్ చేశారు. అతడ్ని పోలీసు శాఖకు తిరిగి పంపేశారు. అయినప్పటికి ఇతగాడు తన బుద్ధిని మార్చుకోకుండా తాను ఏసీబీలో పని చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తూ అక్రమార్జనను కంటిన్యూ చేస్తున్నాడు.

దీంతో ఐదు టీంలను ఏర్పాటు చేసి ఏకకాలంలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఇతడి ఇంటితో పాటు.. ఇతనికి బినామీలుగా వ్యవహరిస్తున్న బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేయగా.. కళ్లు చెదిరే ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. ఒక అంచనా ప్రకారం ఇతడి ఆస్తుల విలువ రూ.10కోట్లుగా అంచనా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఉదంతం ఏపీ ఏసీబీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.