Begin typing your search above and press return to search.

ఆరోగ్య శ్రీ ప్రైవేటు ప‌రం.. క‌ష్ట‌మా..న‌ష్ట‌మా..?

ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేస్తూ తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

By:  Garuda Media   |   6 Sept 2025 8:15 AM IST
ఆరోగ్య శ్రీ ప్రైవేటు ప‌రం.. క‌ష్ట‌మా..న‌ష్ట‌మా..?
X

ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేస్తూ తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసి వంటి సంస్థలకు ఆరోగ్యశ్రీని విడతలవారీగా అప్పగించే కార్యక్రమానికి దాదాపు శ్రీకారం చుట్టినట్టు అయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయల మేరకు ఆరోగ్య సంజీవిని పేరుతో భీమాను అమలు చేస్తోంది. ఇప్పుడు దీనికి అటాచ్ చేస్తూ ఆరోగ్యశ్రీని ప్రైవేటుకు అప్పగించడం ద్వారా రెండున్నర లక్షలు, ఐదు లక్షలు అదేవిధంగా 10 లక్షల నుంచి 15 లక్షలు 20 నుంచి 25 లక్షల వరకు భీమాను కల్పిస్తూ ప్రైవేటు సంస్థలకు ఇచ్చేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశం.

కానీ, వాస్తవానికి ఇట్లా చేయటం ఎంతవరకు మంచిది. పేదలకు చేరువైన పథకం దూరమైతే ప్రభుత్వం మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుందన్నది చర్చనీయాంశం. వైయస్సార్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2004లో తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ పథకం అనేకమంది పేదలకు చేరువయ్యింది. అనేకమంది పేదల జీవితాలను నిలబెట్టింది. అటువంటి పథకాన్ని గత ప్రభుత్వాలు.. ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. కానీ.. అనూహ్యంగా ఆరోగ్యశ్రీ ప్రైవేటుపరం చేస్తూ ఎల్ఐసి వంటి సంస్థలకు అప్పగించడం ద్వారా రేపు పేదలకు ఏ మేరకు మేలు జరుగుతుందని ప్రశ్న.

వాస్తవానికి ఎల్ఐసి అంటే లాభా పేక్ష లేని సంస్థ‌ అయితే కాదు. లాభం లేకుండా ఏ సంస్థ పనిచేయదు. ఆరోగ్యశ్రీని అలా కాకుండా పేదలకు కేవలం సేవ చేయాలన్న ఉద్దేశంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకు వచ్చిన కీలక పథకం. ఇది ఆయనకు పేరు తెచ్చింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని వరుసగా రెండుసార్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీనిని గుర్తించే గత టిడిపి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని కొనసాగించింది. తెలంగాణలో కూడా బిఆర్ఎస్ హయాంలోనూ ఈ పథకం అమలైంది.

ఇప్పుడు అమలు అవుతోంది. కానీ, ఏపీకి వచ్చేసరికి మాత్రం దీన్ని ప్రైవేటుపరం చేస్తూ కేంద్ర అమలు చేస్తున్న ఆరోగ్య సంజీవని ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో లింక్అప్ చేయటం ద్వారా ఎల్ఐసి వంటి సంస్థలకు ఇవ్వడం ఎంతవరకు మేలు చేస్తుంది అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తివే స్తే కచ్చితంగా పేదల్లో తిరుగుబాటు వస్తుంది అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ సంస్థల్లో వాళ్లకు మేలైన వైద్యం అందుతోంది.

కొంత లోకొంత‌ వెనకబాటు ఉన్నప్పటికీ.. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ఇప్పుడు ప్రైవేటుపరం చేస్తే అది ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి వస్తున్నది విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పటికైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటుకు ఇచ్చేందుకే ప్రభుత్వం మగ్గుచూపుతోంది. ఇది వచ్చే ఎన్నికలనాటికి ప్రభుత్వానికి పెద్ద శాపంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది విశ్లేషకుల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.