Begin typing your search above and press return to search.

ట్రైన్ జర్నీస్ చేస్తుంటారా? ఇది అస్సలు మిస్ కావొద్దు

మీరు తరచూ ట్రైన్ జర్నీలు చేస్తుంటారా? అయితే.. మీరు మిస్ కాకుండా చదవాల్సిందే. ఒకవేళ మీకు ట్రైన్ జర్నీ చేసే అలవాటు లేకున్నా.. ఇది తప్పనిసరిగా అప్డేట్ కావాల్సిన అంశం.

By:  Garuda Media   |   16 Sept 2025 9:44 AM IST
ట్రైన్ జర్నీస్ చేస్తుంటారా? ఇది అస్సలు మిస్ కావొద్దు
X

మీరు తరచూ ట్రైన్ జర్నీలు చేస్తుంటారా? అయితే.. మీరు మిస్ కాకుండా చదవాల్సిందే. ఒకవేళ మీకు ట్రైన్ జర్నీ చేసే అలవాటు లేకున్నా.. ఇది తప్పనిసరిగా అప్డేట్ కావాల్సిన అంశం. దూర ప్రయాణాలకు తప్పనిసరిగా రిజర్వేషన్ చేసుకోవటం తెలిసిందే. అయితే.. ఈ విధానంలో ఇప్పటివరకు అమలవుతున్న విధానాన్ని మారుస్తూ కొత్త నిబంధనను అమలు చేయనున్నారు. అక్టోబరు ఒకటి నుంచి ట్రైన్ రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ లో కీలక మార్పును తీసుకొచ్చారు.

ఈ మధ్యనే తత్కాల్ బుకింగ్ సమయంలో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. తమ అకౌంట్లను అథార్ తో వెరిఫై చేసుకున్నయూజర్లు మాత్రమే టికెట్ రిజర్వేషన్లు చేసుకునే వీలు ఉంది. ప్రస్తుతం తత్కాల్ బుకింగ్ కోసం ఈ విధానం అమల్లో ఉండగా.. అక్టోబరు ఒకటి నుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు.

దీంతో.. ఐఆర్ టీసీ అకౌంట్ కు సంబంధించి ఆధార్ తో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే రిజర్వేషన్ చేసుకునే వీలు ఉంటుంది. వచ్చే నెల ఒకటి లోపు మీ ఐఆర్ సీటీసీ అకౌంట్ ను ఆధార్ తో వెరిఫై చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ మార్పు ఎందుకన్న సందేహం రావొచ్చు. దీనికి సహేతుకమైన కారణమే ఉంది. ప్రస్తుతం ఏ రైలుకు అయినా ప్రయాణ తేదీకి 60 రోజుల ముందే టికెట్ రిజర్వు చేసుకునే వెసులుబాటు ఉంది.

తత్కాల్ టికెట్లకు ఎలా అయితే కొందరు ముదుర్లు బ్లాక్ చేస్తున్నారో.. అదే విధంగా ఆదరణ బాగా ఉన్న రైళ్ల రిజర్వేషన్ సీట్లను బుకింగ్ మొదలైనంతనే బ్లాక్ చేస్తున్నారు. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు వీలుగా ఆధార్ తో అథెంటిక్ చేయటం ద్వారా.. రిజర్వేషన్ టికెట్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు వీలు కలుగుతుంది. కొందరు అక్రమార్కుల కారణంగా సామాన్య యూజర్లు నష్టపోతున్నారు. అలాంటి వారికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇక.. రైల్వే స్టేషన్లలో ఉండే రిజర్వేషన్ కౌంటర్ లో టికెట్ బుకింగ్ కు సంబంధించి ఎలాంటి కొత్త మార్పు ఉండదు. పాత విధానమే అమల్లో ఉంటుంది.