Begin typing your search above and press return to search.

రిలేషన్ షిప్ లో కూడా ఇన్ని రకాలా.. మరి మీరే షిప్ లో ఉన్నారు?

రిలేషన్ షిప్ లో రకరకాల బంధాలు అనేవి ఉంటాయి.. అలాంటి రిలేషన్ షిప్ లో ఎక్కువగా యూత్ ఎంటర్ అవుతూ ఉంటారు.. కానీ ఈ రిలేషన్ షిప్ లలో కూడా రకరకాలు ఉన్నాయి..

By:  Madhu Reddy   |   25 Oct 2025 2:00 PM IST
రిలేషన్ షిప్ లో కూడా ఇన్ని రకాలా.. మరి మీరే షిప్ లో ఉన్నారు?
X

రిలేషన్ షిప్ అనేది రకరకాలుగా ఉంటుంది. బంధువుల మధ్య రిలేషన్ షిప్.. స్నేహితుల మధ్య రిలేషన్ షిప్.. దేశ విదేశీయుల మధ్య రిలేషన్ షిప్.. ఒక ఆడ మగ మధ్య రిలేషన్ షిప్.. అలాగే ఒక జంతువుకి మనుషులకు కూడా రిలేషన్ షిప్ అనేది ఉంటుంది.. రిలేషన్ షిప్ లో రకరకాల బంధాలు అనేవి ఉంటాయి.. అలాంటి రిలేషన్ షిప్ లో ఎక్కువగా యూత్ ఎంటర్ అవుతూ ఉంటారు.. కానీ ఈ రిలేషన్ షిప్ లలో కూడా రకరకాలు ఉన్నాయి.. ఇందులో యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్న రిలేషన్ షిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక ఆడ - మగ ఇద్దరికీ పెళ్లి జరిగితే అది భార్యాభర్తల రిలేషన్ షిప్ అవుతుంది.. మహిళకి పిల్లలు పుడితే తల్లి బిడ్డల రిలేషన్ షిప్ అవుతుంది. అదే ఒక అబ్బాయి లేదా అమ్మాయి వేరే వ్యక్తులతో ప్రేమలో పడితే అది లవర్స్ కు సంబంధించిన రిలేషన్ షిప్ అవుతుంది.. ఇలా ఈ సమాజంలో రకరకాల రిలేషన్ షిప్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా 8 రకాల రిలేషన్ షిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి అందులో మీరు ఏ రిలేషన్షిప్ లో ఉన్నారు?

కఫ్ఫింగ్ షిప్: తాత్కాలికంగా ఒక తోడు కోరుకునే వ్యక్తులు వారి సౌకర్యాలకు తగ్గట్టుగా ఉండే ఈ బంధాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా తాత్కాలికంగా ఏర్పడే తోడునే కఫ్ఫింగ్ రిలేషన్షిప్ అంటారు. ఇలాంటి రిలేషన్షిప్ ఈ సమాజంలో చాలామందికి ఉంది.

ఎవాల్యూషన్ షిప్:

ఈ విధంగా రిలేషన్స్ ఏర్పడిన వ్యక్తులు బంధం ఏర్పడిన మొదట్లో మామూలుగానే ఉంటారు.. కానీ రాను రాను వారి మధ్య అనుబంధం అనేది చాలా వరకు పెనవేసుకుపోతుంది. ఒకరి వ్యవస్థను మరొకరు గౌరవిస్తూ ఒకరికి ఒకరు తోడునీడగా ఉంటూ ముందుకు వెళుతూ ఉంటారు..

టెక్స్టింగ్ షిప్:

అయితే ఈ బంధం అనేది ఎక్కువగా టెక్స్ట్ మెసేజ్ ల ద్వారా ఏర్పడుతుంది. ముఖ్యంగా చాటింగ్ చేస్తూ వీరి మధ్య బంధాన్ని పెంచుకుంటూ ఒకరినొకరు ఇష్టపడతారు. టెక్స్ట్ మెసేజ్ ల ద్వారానే వీరి బంధాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. దీన్నే టెక్స్టేషన్ షిప్ అని కూడా అంటారు.

సిచ్యువేషన్ షిప్:

ఈ బంధం అనేది అప్పటి పరిస్థితులను బట్టి వారు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు.. సమయానికి వారు ఒకరికొకరు సహాయం చేసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి సిచ్యువేషన్ బట్టే వారి మధ్య రిలేషన్ అనేది బలపడుతూ ఉంటుంది. అయితే ఈ బంధానికి పెద్దగా హద్దులు ఏమి ఉండవు.. అయితే ఈ బంధం ఎక్కువ రోజులు కొనసాగవచ్చు లేదంటే మధ్యలోనే తెగిపోవచ్చు..

నానో షిప్:

ఈ బంధం అనేది ఓ ఇద్దరి మధ్య చాలా తక్కువ కాలంలోనే ఏర్పడుతుంది. ఉన్నన్ని రోజులు ఒకరిపై ఒకరు అత్యధిక ప్రేమను చూపిస్తూ ఉంటారు.. కానీ విడిపోవడానికి పెద్దగా సమయం పట్టదు..

డెల్యూషన్ షిప్ :

ఈ బంధంలో ఒక వ్యక్తికి మాత్రమే అత్యధికంగా ప్రేమ ఉంటుంది.. అవతలి వ్యక్తి వాళ్ళని ఎక్కువగా ప్రేమించకపోయినా ప్రేమిస్తున్నారనే భ్రమలో పడుతూ ఉంటారు.

బెంచింగ్ షిప్:

ఈ బంధం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. ఇందులో ఒకరిపై ఒకరు పూర్తిగా సంబంధాన్ని పెంచుకోరు.అలాగని ఆ బంధాన్ని తెంచుకోరు. ఏదో అవసరాన్ని బట్టి వారి మధ్య బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు..

బ్రెడ్ క్రంబింగ్ షిప్:

ఈ రిలేషన్ షిప్ లో ఇద్దరిలో ఒక వ్యక్తి ముందుగా ఎక్కువగా ఇష్టం చూపించి వారి వెంటపడతారు. అంతేకాదు మొబైల్ కాల్స్,మెసేజెస్ కూడా చేస్తూ ఉంటారు. కానీ వారిలో పెద్దగా సీరియస్ నెస్ ఉండదు.. ఇక రాను రాను ఆ ప్రేమ అనేది తగ్గించుకుంటూ వస్తారు... అలాగని వీరి బంధాన్ని పూర్తిగా తెంచుకోలేరు..