Begin typing your search above and press return to search.

విమర్శకులకు వెర్రి.. భాషావేత్తలకు పోస్ట్ మాడర్న్.. ఏమిటీ '67'!

ఈ '67'ను కలిపి కాకుండా సిక్స్‌ సెవెన్ అని చదవాలి. వాస్తవానికి ఈ పదం పెరుగుదల యాదృచ్చికం తప్ప మరేమీ కాదు.

By:  Raja Ch   |   31 Oct 2025 4:00 AM IST
విమర్శకులకు వెర్రి.. భాషావేత్తలకు పోస్ట్  మాడర్న్.. ఏమిటీ 67!
X

కొంత ఒక వింత, పాత ఒక రోత అని అంటారు.. మరి కొంతమంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెబుతారు.. దాని కొనసాగింపుగా.. గోల్డ్ నెవ్వర్ బికాం ఓల్డ్ అని అంటుంటారు. రెండింటిలోనూ వాస్తవం ఉందని అనుకుంటే.. తాజాగా ప్రముఖ ఆన్ లైన్ డిక్షనరీ వెబ్ సైట్ "డిక్షనరీ.కామ్" ఈ ఏడాదికి "వర్డ్ ఆఫ్ ద ఇయర్" గా "67"ను ప్రకటించింది. ఈ నెంబర్ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా నోట్లో తెగనానుతోంది!

అవును... ఆధునిక కమ్యూనికేషన్ కి సంబంధించిన ఈ డిజిటల్ గందరగోళాన్ని సంపూర్ణంగా సంగ్రహించే చర్యలో.. డిక్షనరీ.కామ్ 2025 సంవత్సరానికి "67" అనే పదాన్ని దాని వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఎంచుకుంది. ఇంటర్నెట్ స్లాంగ్, మీమ్స్, హాస్యం ఇప్పుడు మనం ప్రతిరోజూ ఉపయోగించే భాషను ఎంత త్వరగా రూపొందిస్తున్నాయో ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది.

వాస్తవానికి.. 30 ఏళ్లు పైబడినవారంతా అసలు దీనర్థం ఏంటని ఆశ్చర్యపోతున్నారు కానీ.. ఇది ఆన్‌ లైన్ సంస్కృతి కి సంబంధించి వైరల్ చిహ్నంగా మారింది.

"67" ఎక్కడ నుండి వచ్చింది?:

ఈ '67'ను కలిపి కాకుండా సిక్స్‌ సెవెన్ అని చదవాలి. వాస్తవానికి ఈ పదం పెరుగుదల యాదృచ్చికం తప్ప మరేమీ కాదు. డిక్షనరీ.కామ్ భాషా విశ్లేషకుల ప్రకారం.. జూన్ 2025 నుండి ఈ “67” కోసం శోధనలు ఆరు రెట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం ఇంటర్నెట్‌ లో అత్యధికంగా శోధించబడిన ఎక్స్ ప్రెషన్స్ లో ఇది ఒకటిగా నిలిచింది.

ఈ ట్రెండ్ అమెరికా ర్యాపర్ స్క్రిల్లా పాడిన డ్రిల్ సాంగ్‌ "డూట్ డూట్ (6 7)" తో ప్రారంభమైంది. ఆ తర్వాత, టిక్‌ టాక్ బాస్కెట్‌ బాల్ క్లిప్‌ లు, "67 కిడ్" అని పిలువబడే టీనేజ్ సృష్టికర్తను కలిగి ఉన్న వీడియోలతో నిండిపోయింది. అనంతరం.. కొన్ని వారాలలోనే ఈ పదబంధం డిజిటల్ సరిహద్దులను దాటింది. పాఠశాలల్లో స్పష్టమైన కారణం లేకుండా విద్యార్థులు పదే పదే "67" అని జపిస్తున్న పరిస్థితి నెలకొంది.

"67" అంటే నిజంగా అర్థం ఏమిటి?:

“67” అంటే నిజంగా అర్థం ఏమిటి? అనే ప్రశ్న ఈ నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తోంది. డిక్షనరీ.కామ్ ప్రకారం.. ఈ పదాన్ని తరచుగా .. 'అలా-అలా' లేదా 'బహుశా' అని చెప్పడం వంటి వాటికి ఉపయోగిస్తారు. మరికొన్ని సందర్భాల్లో రెండు అరచేతులు పైకి క్రిందికి ఊగే ఉల్లాసభరితమైన సంజ్ఞకు ఉపయోగిస్తారు. దీన్ని పలువురు భాషావేత్తలు 'లోతైన దానికి ప్రతీక' అని నమ్ముతారు.

2025 ని నిర్వచించిన ఇతర పదాలు!:

“67” ఒక్కటే కాదు. షార్ట్‌ లిస్ట్ చేయబడిన ఇతర పదాలలో “ఆరా ఫార్మింగ్”, “క్లాంకర్”, “ఏజెంటిక్”, “బ్రోలిగార్కీ”, 'డైనమైట్ ఎమోజి', “కిస్ కామ్”, “ఓవర్‌ టూరిజం”, “జెన్ జెడ్ స్టేర్”, “ట్రేడ్‌ వైఫ్”, “టారిఫ్” ఉన్నాయి. ఈ నేపథ్యంలో... విమర్శకులు ఈ "67" వ్యవహారాన్ని వెర్రి అని పిలుస్తుండగా.. భాషావేత్తలు మాత్రం దీనిని 'పోస్ట్ మాడర్న్' అని పిలుస్తున్నారు.