Begin typing your search above and press return to search.

మీరు చదువుతున్నది కరెక్టే.. ఫ్లాటు ధర రూ.500 కోట్లు

ఇప్పుడు దీన్ని చదువుతున్న వారు ఎవరైనా రూ.500 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పగలరా? వెంటనే చెప్పలేకపోవచ్చు. కాస్త ఆలోచిస్తే చాలామంది చెబుతారు.

By:  Garuda Media   |   30 Sept 2025 1:30 PM IST
మీరు చదువుతున్నది కరెక్టే.. ఫ్లాటు ధర రూ.500 కోట్లు
X

అసలు విషయంలోకి వెళ్లటానికి ముందు కాస్తంత సరదాగా ఒక విషయాన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు దీన్ని చదువుతున్న వారు ఎవరైనా రూ.500 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పగలరా? వెంటనే చెప్పలేకపోవచ్చు. కాస్త ఆలోచిస్తే చాలామంది చెబుతారు. అవును.. 500 కోట్లలో సున్నాలు అక్షరాల తొమ్మిది. ఇదంతా ఎందుకంటే.. ఒక వెంచర్ లో ఒక ఖరీదైన.. లగ్జరీ ఫ్లాట్ ధర ఎంత ఉంటుంది? మీ నోటి నుంచి వచ్చే మాట రూ.10 కోట్లు.. లేదంటే యాభై కోట్లు.. ఇటీవల గురుగ్రామ్ లో డీఎల్ఎఫ్ సంస్థ నిర్మిస్తున్న కామెలియాస్ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ధర అక్షరాల రూ.100 కోట్లుగా ప్రకటించి సంచలనానికి తెర తీశారు.

దీనికి మించిన ఒక వెంచర్ ను ప్రకటించింది సన్ టెక్ రియాక్టీ సంస్థ. తాము త్వరలో నిర్మించే అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ధరను ఏకంగా రూ.500 కోట్లుగా డిసైడ్ చేసింది. నిజానికి ఇప్పటివరకు ఎవరూ డిసైడ్ చేయనంత ఖరీదైన నిర్మాణంగా దీన్ని చెప్పాలి. ఈ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కనిష్ఠ ధర రూ.100 కోట్లు అయితే.. గరిష్ఠ ధర రూ.500 కోట్లుగా పేర్కొంటున్నారు.

‘‘ఎమాన్సే’’ బ్రాండ్ మీద నిర్మించే ఈ అల్ట్రా లగ్జరీ అపార్ట్ మెంట్లను ముంబయి.. దుబాయ్ లోనూ నిర్మించాలని భావిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులపైనే రూ.20వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్నట్లుగా సంస్థ సీఎండీ కమల్ ఖేతన్ చెబుతున్నారు. 2026 జూన్ లో ఈ ప్రాజెక్టు పనులను స్టార్ట్ చేయనున్నట్లుగా చెబుతున్నారు.

కుబేరులు.. అత్యంత సంపన్నుల సంఖ్య దేశీయంగా పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్టును ప్లాన్ చేసినట్లుగా ఆయన చెబుతునారు. రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఈ వెంచర్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మరి..దీని బుకింగ్స్ ఏ రీతిలో ఉంటాయో చూడాలి. మార్కెట్ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వెంచర్ నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.2.50 లక్షలుగా మారింది. బుకింగ్స్ ఏ రీతిలో జరుగుతాయో చూడాలి.