Begin typing your search above and press return to search.

నవంబర్‌లో భూమిపైకి 'ఏలియన్' ఓబ్జెక్టు?

అంతరిక్షంలో కనిపించిన ఒక రహస్య వస్తువు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు.. ప్రజలలో కలవరం సృష్టిస్తోంది.

By:  A.N.Kumar   |   30 July 2025 1:00 PM IST
నవంబర్‌లో భూమిపైకి ఏలియన్  ఓబ్జెక్టు?
X

అంతరిక్షంలో కనిపించిన ఒక రహస్య వస్తువు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు.. ప్రజలలో కలవరం సృష్టిస్తోంది. "3I/ATLAS"గా పిలువబడుతున్న ఈ అంతరిక్ష వస్తువు, అసలు ఏలియన్ నౌక కావచ్చని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అవి లోయబ్ అభిప్రాయపడుతున్నారు. ఇది మానవ నిర్మితమైతే ఖచ్చితంగా అలా పరిగణించలేమని, దాని మార్గం, వేగం, గమన దిశలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

-బాబా వంగా భవిష్యవాణి గుర్తొస్తుందా?

ప్రసిద్ధ బల్గేరియన్ భవిష్యద్రష్ట బాబా వంగా గతంలో భూమిని ఏలియన్లు లేదా రహస్య శక్తులు నవంబర్ నెలలో సందర్శించవచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 3I/ATLAS పేరిట వస్తున్న ఈ వస్తువు నవంబర్ 2025లో భూమికి అత్యంత సమీపంగా చేరనుందని NASA వెల్లడించింది. ఇది బాబా వంగా చెప్పిన భవిష్యవాణితో సరిపోతుండటంతో ఈ అంశంపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది.

3I/ATLAS అంటే ఏమిటి?

ఇది ఒక అంతరిక్ష వస్తువు అని గుర్తించారు. 2017లో కనిపించిన ఓముఆముఆ అనే మరో అంతర్జాల వస్తువుతో పోల్చినప్పుడు ఇది మరింత వేగంగా, మరింత గమ్మత్తైన కోణంలో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మానవ నిర్మితమైనది కాదు. కాకపోతే సహజంగా ఏర్పడిందా? లేక రహస్య ఏలియన్ టెక్నాలజీనా అనే దానిపై స్పష్టత రాలేదు.

ఏలియన్ స్పై టెక్నాలజీనా?

ప్రొఫెసర్ అవి లోయబ్ ప్రకారం, ఈ వస్తువు దాని గమన దిశ వల్ల ఇతర గ్రహాలపై నిఘా పరికరాలను వదిలే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భూమిపై దాడికి ముందు పరిసర గ్రహాలపై గమనిక పెట్టేందుకు ఇది ఉపయోగపడవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఇది నిజమైతే నవంబర్ 2025లో భూమికి సన్నిహితంగా వచ్చే ఈ వస్తువు ఒక 'ఏలియన్ మిషన్'లో భాగం కావచ్చని భావిస్తున్నారు.

భూమికి ప్రమాదమా?

ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ వస్తువు భూమికి తాకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, ఇది భూమి పరిసరాలను స్కాన్ చేయవచ్చుననే ఆందోళన ఉంది. అమెరికాలోని SETI (సెర్చ్ ఫర్ ఎక్స్ ట్రా టెర్రెస్ట్రీయల్ ఇంటెలిజెన్స్ ) సంస్థలతో పాటు ఇతర అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు ఈ వస్తువుపై ప్రత్యేకంగా పరిశీలన చేపట్టాయి.

-భవిష్యత్తును చెబుతోందా బాబా వంగా జ్ఞానం?

నవంబర్‌లో ఏలియన్ సంబంధిత ఏదైనా సంఘటన జరిగితే అది బాబా వంగా భవిష్యవాణిని నిజం చేస్తుందా? లేక ఇది కూడా ఓ సహజ ఖగోళ సంఘటనా? ప్రస్తుతం ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. భూమికి భయం అవసరం లేదా అనే విషయం తెలుసుకోవాలంటే, శాస్త్రవేత్తలు ఇచ్చే తదుపరి సమాచారం కోసం వేచి చూడాల్సిందే.