Begin typing your search above and press return to search.

డిగ్రీ పాస్ కాలేదు.. జాబ్ లేదు.. నెలకు 39 లక్షలు సంపాదిస్తోన్న 22 ఏళ్ల యువతి

ఎన్ని డిగ్రీలున్నా.. ఎన్ని పీజీలు చేసినా ఈ మధ్యకాలంలో ఉద్యోగం దొరకడం నానా కష్టమైపోయింది.

By:  A.N.Kumar   |   9 Dec 2025 11:00 PM IST
డిగ్రీ పాస్ కాలేదు.. జాబ్ లేదు.. నెలకు 39 లక్షలు సంపాదిస్తోన్న 22 ఏళ్ల యువతి
X

ఎన్ని డిగ్రీలున్నా.. ఎన్ని పీజీలు చేసినా ఈ మధ్యకాలంలో ఉద్యోగం దొరకడం నానా కష్టమైపోయింది. ఏఐ వచ్చాక ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి. పీజీలు చేసిన వారు, ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్లు సైతం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పోటీపడుతున్న దుస్థితి నెలకొంది. ఇంతటి దుర్భర దారిద్ర్యం తాండవిస్తున్న నేటి సమయంలో ఓ యువతి మాత్రం అబ్బురపరుస్తోంది.

డిగ్రీ కూడా లేకుండా.. ఎలాంటి జాబ్ చేయకుండానే.. 22 ఏళ్ల భారతీయ యువతి నెలకు ఏకంగా రూ.34.9 లక్షలు సంపాదిస్తోంది. ఆ యువతే స్వయంగా తన విజయ రహస్యాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారింది.

భారత్ కు చెందిన 22 ఏళ్ల కంటెంట్ రైటర్ ‘ముస్కాన్ కారియా’ తన ఇన్ స్టాగ్రామ్ ను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది. ఆమె సంప్రదాయ కళాశాల విద్యను వదిలి.. భావోద్వేగ కంటెంట్ పై దృష్టి పెట్టింది. దీని ద్వారా ఆమె తనకంటూ ఒక బలమైన విశ్వసనీయమైన ఫాలోవర్స్ ను నిర్మించుకుంది. ఈ కమ్యూనిటీ ద్వారానే ఆమె ఇంతలా సంపాదిస్తోంది.

నెలకు దాదాపు రూ.34.9 లక్షలు సంపాదిస్తూ ఈ క్రియేటర్ తన శక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించింది. ఆమె టాలెంట్ కు ప్రతి నెలా రూ.400 చొప్పున చెల్లించే 8731 మంది సభ్యులు ఉన్నారు. దీని ద్వారా ఆమె సంవత్సరానికి రూ.4 కోట్లకు పైగానే ఆదాయం పొందుతోంది. ఈ విధానం ఎక్కువమంది ఫాలోవర్లపై కాకుండా.. డబ్బు చెల్లించే డెడికేటెడ్ సభ్యులపై ఆధారపడుతుంది. ప్రత్యేకమైన కంటెంట్ కు యాక్సెస్ ఇవ్వడం ద్వారా ఆమె ఈ స్థిరమైన ఆదాయాన్ని సాధించింది.

ముస్కాన్ ‘నిచ్’ రంగంలో నిజాయితీగా కంటెంట్ అందిస్తోంది. సబ్ స్క్రిప్షన్ కింద సభ్యత్వ రుసుమును విజయవంతంగా అమలు చేస్తోంది. క్రమం తప్పకుండా కంటెంట్ పోస్టులు పెడుతూ ఎప్పటికప్పుడూ కంటెంట్ ను చేరువ చేస్తోంది. ఉచిత ఫాలోవర్స్ సంఖ్యను పట్టించుకోకుండా ఫీజు చెల్లించిన వారికే తన కంటెంట్ అందేలా వ్యవహరించడం ఈమె విజయం రహస్యం

ముస్కాన్ కారియా ఇలా తన కంటెంట్ తోనే డిజిటల్ అవకాశాలను అందిపుచ్చుకుంది. గొప్ప మార్గదర్శిగా నిలిచింది. కొత్త ఫ్లాట్ ఫారామ్ లలో అవకాశాలను అన్వేశించడం యువతను కొత్త ఆలోచనలకు తీసుకెళ్లడం కంటెంట్ తో ఈమె చేసే ప్రధాన పని.

ముస్కాన్ నిబద్దతతో కంటెంట్ ను పోస్ట్ చేస్తూ కొత్త అవకాశాలను తెరుస్తోంది. డిజిటల్ గా సేవలందిస్తూ క్రియేటివిటీతో ముందుకెళుతోంది. ఇలా లక్షలాది మంది యువతను ఆకర్షిస్తూ సంపాదిస్తోంది.