Begin typing your search above and press return to search.

ఇరాన్ కి 22 దేశాల బిగ్ అప్పీల్...అలా చేయకపోతే !

పశ్చిమాసియాలో నానాటికీ తీవ్రమవుతున్న ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.

By:  Satya P   |   22 March 2026 12:12 AM IST
ఇరాన్ కి 22 దేశాల బిగ్ అప్పీల్...అలా చేయకపోతే !
X

పశ్చిమాసియాలో నానాటికీ తీవ్రమవుతున్న ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.ఏకంగా 22 దేశాలు ఒకేసారి ఇరాన్ వైఖరిని తప్పు పడుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అందులో ఇరాన్ కి ఒక భారీ విన్నపం చేస్తూనే అలా కనుక చేయకపోతే ప్రపంచంలోని పరిణామాలు ప్రమాదంలో పడుతాయని హెచ్చరించడం విశేషం. ఇరాన్ ఇకనైనా తగ్గి దారికి రావాలని ఈ దేశాలన్నీ కోరడం విశేషం.

జలసంధిని తెరవాలని :

ఇరాన్ విషయంలో ఒక భారీ కదలిక తీసుకుని రావడానికి కీలక దేశాలు అన్ని నడుం బిగించాయి ప్రపంచవ్యాప్త భవిష్యత్తు పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఇరాన్ తక్షణమే తన దాడులను నిలిపివేయాలని కోరాయి. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని 22 దేశాలు తాజాగా ఇరాన్‌ను కోరాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా ఆస్ట్రేలియాతో సహా పలు దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో ఈ మేరకు ఇరాన్ కి వినతి చేశాయి. పశ్చిమాసియా ప్రాంతంలోని వాణిజ్య నౌకలు ఇంధన సౌకర్యాలపై ఇరాన్ దాడులను ఈ దేశాలు ఒక్కటిగా నిలిచి ఖండించాయి. ఇటువంటి చర్యల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలపై పడుతుందని హెచ్చరిస్తూనే తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చాయి.

ఇరాన్ అధ్యక్షుడితో మోడీ :

మరో వైపు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియన్‌తో మాట్లాడారు. ఇరాన్ యుద్ధంలోకి దిగిన తరువాత తొలిసారి మోడీ ఆ దేశ అధ్యక్షుడితో సంభాషించడం జరిగింది అని అంటున్నారు. ఈద్ పండుగ శుభాకాంక్షలని మోడీ ఆయనకు తెలియచేశారు. తెలిపారు. ఈ పండుగ కాలం పశ్చిమ ఆసియాకు శాంతి స్థిరత్వం శ్రేయస్సును తీసుకువస్తుందని ఇద్దరు నాయకులు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

తక్షణ ప్రాముఖ్యతగా :

పశ్చిమాసియా ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను కూడా మోడీ ఖండించారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగే సరఫరా గొలుసులకు ఇవి తీవ్రమైన అంతరాయం కలిగిస్తాయని మోడీ చెప్పారు. నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం షిప్పింగ్ మార్గాలు తెరిచి సురక్షితంగా ఉండేలా చూడటం తక్షణ ప్రాముఖ్యతగా మోడీ చెప్పడం విశేషం. ఇక ఇరాన్‌లో ఉన్న భారత ప్రజల భద్రతకు ఇరాన్ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతును సైతం మోదీ అభినందించడం గమనార్హం.