Begin typing your search above and press return to search.

రికార్డ్‌: 170 మంది ఒకే సారి.. 'క‌గార్' విజ‌యమ‌న్న కేంద్రం

మ‌రోవైపు.. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త నాలుగు మాసాల్లో 370 మంది మావోయిస్టుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు హ‌త మార్చాయి.

By:  Garuda Media   |   16 Oct 2025 7:35 PM IST
రికార్డ్‌: 170 మంది ఒకే సారి.. క‌గార్ విజ‌యమ‌న్న కేంద్రం
X

మావోయిస్టు ఉద్య‌మానికి తెర‌ప‌డుతున్న క్ర‌మంలో మ‌రో కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకుంది. తాజాగా గురువా రం సాయంత్రం ఒకే సారి 170 మంది మావోయిస్టులు.. పోలీసుల‌కు లొంగిపోయారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌రిద్ద‌రు.. లేదా ప‌దుల సంఖ్య‌లో లొంగిపోయిన మావోయిస్టులు.. తాజాగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌భుత్వం ముందు 170 మంది మావోయిస్టులు.. అస్త్ర స‌న్యాసం చేశారు. ఇక‌, తాము ప్ర‌జాజీవ‌నంలోకి వ‌స్తున్న‌ట్టు చెప్పారు.

ఇక‌, దీనిని కేంద్ర ప్ర‌భుత్వం స‌రికొత్త రికార్డుగా పేర్కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు లొంగిపోయిన వారికంటే..ఈ సం ఖ్య పెద్ద‌ద‌ని.. దేశాన్ని మావోయిస్టు ర‌హితంగా తీర్చిదిద్దే క్ర‌తువులో ఇది భారీ ముంద‌డుగుగా పేర్కొంది. వ చ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిజాన్ని రూపు మాప‌డ‌మే ధ్యేయంగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుముందుకు సాగుతోంద‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇది ఆప‌రేష‌న్ క‌గార్ సాధించిన విజ‌యంగా తెలిపారు.

మ‌రోవైపు.. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త నాలుగు మాసాల్లో 370 మంది మావోయిస్టుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు హ‌త మార్చాయి. మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో ఇటు వైపు కూడా భారీ న‌ష్ట‌మే జ‌రిగిందన్న వాద‌న ఉన్నా.. అధికారులు మాత్రం.. కేవ‌లం 32 మంది సిబ్బందిని మాత్ర‌మే కోల్పోయామ‌నిచెబుతున్నారు. ఇక‌, మావోయిస్టుల్లో పెద్ద త‌ల‌కాయ‌లుగా ఉన్న నంబాల కేశ‌వ్‌రావు వంటి వారు చ‌నిపోవ‌డం.. ఉద్య‌మంపై ప్ర‌భావం చూపింది. ఇది క‌గార్ సాధించిన విజ‌యంగా అమిత్ షా చెబుతున్నారు.

ఆ ప్రాంతాల‌కు విముక్తి!

కేంద్రం చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని అత్యంత మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాలైన అబూజ్ మడ్‌(ఇది కేంద్ర ప్రాంతంగా పేర్కొంటారు. ఇక్క‌డే అనేక స‌మావేశాలు.. జ‌రిగాయి), ఉత్త‌ర బ‌స్త‌ర్ (కంచుకోట‌)ల‌ను విముక్తి ప్రాంతాలుగా ప్ర‌క‌టించారు. తాజాగా ఈ మేర‌కు కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న చేశారు. రాజ్యాంగాన్ని న‌మ్మి.. తుపాకులు వ‌దిలి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలోకి వ‌స్తున్న‌వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌న్నారు. వారికోసం.. కోట్ల రూపాయ‌లు(రివార్డు) ఎదురు చూస్తున్నాయ‌ని.. ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు.