భార్య మంచంలో దాక్కొన్న ప్రియుడు... వైరల్ వీడియో!
ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు మరీ పెచ్చిమీరిపోతున్నాయనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 26 Sept 2025 10:15 AM ISTఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు మరీ పెచ్చిమీరిపోతున్నాయనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్రమ సంబంధాలు, తద్వారా భాగస్వామిని హత్య చేసిన ఘటనలు ఇటీవల వరుసగా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా తన భార్య మంచంలో దాక్కొన్న ప్రియుడిని పట్టుకున్న వీడియో ఒకటి నెట్టింట సంచలనంగా మారింది.
అవును... తాజాగా నెట్టింట సుమారు 15 మిలియన్ వ్యూస్ తో వైరల్ గా మారిన వీడియోలో ఓ వ్యక్తి మంచంలోపల పడుకుని ఉన్నాడు. ఆ సమయంలో తన భార్య మంచం లోపల ఆమె ప్రియుడు ఉన్నాడని గ్రహించిన వ్యక్తి.. వీడియో షూట్ చేస్తూ, ఆ మంచంపై ఉన్న పరుపు తీసి, ఆపై ఫ్లై ఉడ్ ఓపెన్ చేయగా.. దాని లోపల అతడు పడుకుని ఉన్నాడు.
ఆ షాక్ నుంచి ఆ ప్రియుడు తేరుకునేలోపు ఆమె భర్త బడితపూజ చేయడం మొదలుపెట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సమాజంలో పెచ్చు మీరిపోతున్న తాజా పద్దతులకు ఈ వీడియో తాజా ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు పెద్ద ఎత్తున తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
మరోవైపు.. వ్యక్తిగత జీవితాల్లోని విభేదాలు నెట్టింట ఎలా ఎంటర్ టైన్ మెంట్ గా మారతాయో కూడా ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోలో ఉన్న వారికి ఇది బహిరంగ అవమానం అనేది ఒకెత్తు అయితే... ఇది పెద్ద ఎత్తున ఒక వినోద వీడియోగా మారడం మరొకెత్తు.
