Begin typing your search above and press return to search.

కండోమ్స్ పై భారీ టాక్స్.. కారణం ఏంటో తెలిస్తే షాక్!

ఏ దేశం అయినా అభివృద్ధి చెందాలి అంటే వృద్ధుల కంటే యువత ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంటుంది.

By:  Ramesh Palla   |   3 Dec 2025 1:44 PM IST
కండోమ్స్ పై భారీ టాక్స్.. కారణం ఏంటో తెలిస్తే షాక్!
X

ఏ దేశం అయినా అభివృద్ధి చెందాలి అంటే వృద్ధుల కంటే యువత ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంటుంది. యువత తోనే అభివృద్ధి సాధ్యం అని ప్రతి ఒక్కరి అభిప్రాయం.. అదే వాస్తవం. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు యువత వెంట పడుతున్నాయి. ఒకప్పుడు జనాభాను తగ్గించేందుకు ప్రయత్నాలు చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు జనాభాను పెంచేందుకు నాన్న తండాలు పడుతున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్ తో పాటు మరికొన్ని దేశాలు తమ జనాభాను పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో యువత కంటే వృద్ధుల జనాభా రేటు ఎక్కువ అయ్యింది. అందుకే యువత రేటు పెంచడం కోసం ఇప్పుడు పిల్లల్ని కనాలంటూ తమ దేశస్తులకి ఆయా దేశాల ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే చైనాలో 30 ఏళ్ల తర్వాత యువత జనాభా రేటు అత్యంత దారుణంగా పడిపోయే అవకాశం ఉంటుంది. దాంతో పనిచేసే వారి సంఖ్య చాలా తగ్గుతుంది. అందువల్ల దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లడం సాధ్యం కాదు.

చైనా జనాభాలో యువత రేటు...

చైనాలో 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది అని ఒక అధ్యాయంలో వెల్లడి అయ్యింది. అందుకే చైనా ప్రభుత్వం యువత జనాభాను పెంచేందుకు ఇప్పుడు పిల్లల్ని కనాలంటూ ప్రోత్సాహకాలు అందజేస్తుంది. కానీ చైనా యువతలో సంతాన ఉత్పత్తిపై ఆసక్తి కనిపించడం లేదు. పిల్లల్ని కనడం వల్ల వారు ఒక బాధ్యతల వలయంలో పడినట్లు అవుతుందని భావిస్తున్నారు. అందుకే పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపించడం లేదు. పిల్లలు కాకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అదేవిధంగా కండోమ్స్ ని ఉపయోగించి కూడా పిల్లలు కాకుండా ఈ తరం యువత ప్రయత్నిస్తుందని చైనా ప్రభుత్వం దృష్టికి వచ్చిందట. అందుకే చైనా ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 1993లో చైనా కండోమ్స్ పై పన్ను తొలగించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కండోమ్స్ పై ఎలాంటి ట్యాక్స్ విధించడం లేదు. మళ్లీ ఇప్పుడు చైనా ప్రభుత్వం కండోమ్స్ పై ఏకంగా 13% పన్నును విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కండోమ్స్ ఖరీదు ఎక్కువ అవుతుంది తద్వారా వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

కండోమ్స్ రేటు పెరగడంతో...

కేవలం కండోమ్స్ పై మాత్రమే కాకుండా గర్భనిరోధక మాత్రాలపై సైతం 13% పన్నును విధిస్తూ చైనా ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం జనాభా పెరుగుదల కోసం అన్నట్లుగా సమర్ధించుకుంటున్నట్లు ఆ కథనాల్లో చూడవచ్చు. చైనా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా తమ దేశ జనాభా పెరుగుదల రేటును పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జనాభా పెరుగుదల రేటు అత్యంత దారుణంగా పడిపోయిన నేపథ్యంలో రాబోయే కాలంలో పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చైనా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే పిల్లల్ని అనేందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు రెడీ అయింది. అంతేకాకుండా పిల్లల్ని కన్న వారికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు కూడా ప్రకటిస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా చైనా యువతలో పిల్లల్ని కనేందుకు ప్రేరణ కల్పించేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కువ ఫలితాలను ఇవ్వడం లేదు. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అయినా జననాల రేటు పెంచాలని చైనా ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది.

భారతదేశంలోనూ జనాభా...

చైనా ప్రధానంగా రాబోయే 20 నుంచి 30 ఏళ్ల తర్వాత కార్మికుల కొరతను ఎదుర్కోబోతుంది. ప్రస్తుతం చైనాలో ఉన్న కార్మికుల సంఖ్య అధికంగా ఉన్న కారణంగా అత్యధిక ప్రొడక్టివిటీ నమోదవుతుంది. అందువల్ల ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చైనా వస్తువులకి రేటు తక్కువగా ఉంటుంది. ఒకవేళ కార్మికుల కొరత ఏర్పడితే ప్రోడక్టివిటీ తగ్గుతుంది. తద్వారా చైనా వస్తువుల సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాల వస్తువుల సంఖ్యతో పోలిస్తే రేటు విషయంలో పెరుగుతుంది. అది ఖచ్చితంగా అంతర్జాతీయ మార్కెట్లో చైనా ను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఎదగాలని ప్రయత్నంతో ఉన్న చైనాకు ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. అందుకే జనాభాను పెంచేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది చూడాలి. చైనా దారిలోనే భారత్ సైతం జనాభా పెరుగుదలపై శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. అయితే కండోమ్స్ వంటి వాటిపై పన్ను విధించడం అనే చెత్త పని భారత్ చేయదని విశ్లేషకులు అభిప్రాయం.