టెక్ కంపెనీల కాదు.. బ్యాంకులు మొదలెట్టాయి.. 10వేల మంది ఔట్
ఇలా తొలగింపుల ద్వారా ఖాళీ అయిన పోస్టుల్లో కొత్త నియామకాలు జరుపవచ్చని తెలుస్తోంది. ఉన్న సిబ్బందితోనే ఖాళీలను సర్దుబాటు చేస్తారని సమాచారం.
By: A.N.Kumar | 8 Dec 2025 7:00 PM ISTఇన్నాళ్లు సాఫ్ట్ వేర్ కంపెనీలే అనుకున్నాం కానీ.. ఇప్పుడు కోతలు పెట్టడానికి బ్యాంకులు కూడా రెడీ అయిపోయాయి. దీంతో బ్యాంకు ఉద్యోగులు సైతం రోడ్డున పడే పరిస్థితులు దాపురించాయి. తాజాగా ప్రపంచంలోనే దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన స్విస్ బ్యాంక్ యూబీఎస్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని ప్రణాళికలను సిద్దం చేసింది. వ్యయ నియంత్రణ పేరిట ఏకంగా 10వేల మంది వరకూ ఉద్యోగులను తొలగిస్తోందట.. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ కథనాలను ప్రచురిస్తున్నాయి.
క్రెడియ్ సూయిస్ ను 2023లోనే ఈ స్విట్జర్లాండ్ బ్యాంక్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత కార్యకలాపాల ఖర్చులు తగ్గించుకునేందుకు యూపీఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని అనుకుంటోంది. స్వచ్ఛంద పదవీ విరమణ, సిబ్బంది వలసల రూపంలో సిబ్బంది తగ్గింపు ఉంటుందని వార్త కథనాలు వస్తున్నాయి.
ఇలా తొలగింపుల ద్వారా ఖాళీ అయిన పోస్టుల్లో కొత్త నియామకాలు జరుపవచ్చని తెలుస్తోంది. ఉన్న సిబ్బందితోనే ఖాళీలను సర్దుబాటు చేస్తారని సమాచారం.
స్విట్జర్లాండ్ తోపాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఆఫీసుల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు సైతం ఈ లేఆఫ్స్ లో భాగమేనని.. ఇతర దేశాల్లో ఉద్యోగులపై ప్రభావం తక్కువగా పడేలా చూస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.
2023 నాటికి ఈ బ్యాంకులో 1,19, 100 మంది ఉద్యోగుల సంఖ్య ఉన్నట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆ తర్వాత 2024 చివరికి ఉద్యోగుల సంఖ్య 1,10,000 కు తగ్గింది. 2025 సెప్టెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య 1,04,427కు పడిపోయింది. ఈ మూడేళ్లలోనే 15వేల మందికి పైగా ఉద్యోగులు సంఖ్య తగ్గినట్లుగా సోన్ ట్యాగ్స్ బ్లింక్ నివేదిక వెల్లడించింది.
వచ్చే నాలుగుఐదు త్రైమాసికల్లో 2000 స్థాయికి ప్రతీ సారి తొలగించవచ్చని అంటున్నారు. వచ్చే ఏడాది 2027 నాటికి పదివేలకు పైగా తొలగిస్తుండడంతో ఉద్యోగుల సంఖ్య మరింత పడిపోనుంది.
ఇక స్విస్ బ్యాంకు 2023లో క్రెడిట్ సూయిస్ ను కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. అందుకోసం సుమారు 2.7 ట్రిలియన్ డాలర్లను వెచ్చించింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద బ్యాంకు విలీనంగా చెబుతారు.
