ఏమిటీ జాబ్ హగ్గింగ్.. మీలోనూ ఈ లక్షణం ఉందా?
ఇలాంటి రీల్ సీన్లు చూసేందుకు ఎగ్జైటింగ్ గా ఉన్నా.. రియల్ లైఫ్ లో మాత్రం ఈ ధోరణిని ప్రదర్శించాలంటే అందుకు ఎంతో ధైర్యం కావాలి.
By: Garuda Media | 15 Sept 2025 1:00 PM ISTరీల్ లో చూసే సీన్లకు ఏ మాత్రం సంబంధం లేకుండా రియల్ సీన్లు ఉంటాయి. సినిమాల్లో హీరోలకు తాము చేస్తున్న ఉద్యోగాలు నచ్చకుంటే.. లెఫ్ట్ లెగ్ తో తన్నేసి.. బయటకు వచ్చేస్తుంటారు. ఇలాంటి రీల్ సీన్లు చూసేందుకు ఎగ్జైటింగ్ గా ఉన్నా.. రియల్ లైఫ్ లో మాత్రం ఈ ధోరణిని ప్రదర్శించాలంటే అందుకు ఎంతో ధైర్యం కావాలి. సగటు జీవి ఎట్టి పరిస్థితుల్ని ఈ తరహాలో వ్యవహరించటం కనిపించదు. ఇంతకూ జాబ్ హగ్గింగ్ ఏంటే ఏమిటి? ఈ సిండ్రోమ్ బారిన పడినోళ్లు ఎలా బిహేవ్ చేస్తారు? ఇంతకూ మీలో ఈ గుణం ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర వివరాలు వెలుగు చూస్తాయి.
చేసే ఉద్యోగం నచ్చకున్నా.. దాన్నే చేసుకుంటూ బండి లాగించేస్తుంటారు. అంతే తప్పించి కొత్త ఉద్యోగాన్ని వెతుక్కునేందుకు మాత్రం ముందుకు అడుగు వేయరు. ఎందుకొచ్చిన రిస్కు అనుకుంటూ చేస్తున్న ఉద్యోగం నచ్చకున్నా.. దాన్ని కంటిన్యూ చేసే తీరునే ‘జాబ్ హగ్గింగ్’గా పేర్కొంటున్నారు. ఉద్యోగుల్లో ఈ ధోరణి అంతకంతకూ ఎందుకు పెరుగుతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఆర్థిక అనిశ్చితి.. ఉద్యోగభద్రత లేకపోవటం కూడా ఈ తరహా పరిస్థితులకు కారణాలుగా చెబుతున్నారు.
ఇటీవల కాలంలో అగ్రరాజ్యంలోనూ ఉద్యోగ అవకాశాలు గణనీయంగా తగ్గాయి. దీంతో.. ఉన్న ఉద్యోగంలో సేఫ్ గా ఉన్నానా? లేనా? అన్న విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. చేస్తున్న జాబ్ నచ్చకున్నా.. ప్రస్తుతానికి ఆ జాబ్ లోనే కంటిన్యూ కావాలన్న యోచన చేస్తున్నట్లుగా చెప్పాలి. ఇలాంటి ఉద్యోగుల్లో కంపెనీ పట్ల విధేయత చూపరని.. వాళ్లు తమకున్న భయానికి సూచనగా ఉంటారని స్పష్టం చేస్తున్నారు.
అయితే.. ఈ ధోరణి జాబ్ హగ్గింగ్ సిండ్రోమ్ తో బాధపడే వారి గురించి ప్రస్తావిస్తూ.. వీరిలో టాలెంట్ ఎంత ఉన్నా.. కంపెనీలు ఇలాంటి వారిని తమ వెంట ఉంచుకోవటానికి ఇష్టపడరని చెబుతున్నారు. దీనికి కారణం.. భయంతో ఉద్యోగాన్ని అంటి పెట్టుకునే వారుఎప్పుడూ ఉత్సాహంగా ఉండరని.. పని కల్చర్ ను దెబ్బ తీస్తుందని సంస్థలు భావిస్తున్నాయి. ఇలాంటి ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు యాజమాన్యాలు ఎలాంటి మొహమాటాన్ని ప్రదర్శించవని హెచ్చరిస్తున్నారు. సో.. మీలోనూ జాబ్ హగ్గింగ్ సిండ్రోమ్ ఎంత ఉందన్నది సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
