10వ తరగతి అర్హత... రూ.56,900 జీతం... లాస్ట్ డేట్ ఇదే!
ఈ సమయంలో.. 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దామ్..!
By: Raja Ch | 22 Nov 2025 3:00 PM ISTజీవితంలో ఎంత పెద్ద ప్రైవేటు ఉద్యోగం చేసినా.. చిన్నదో, పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే తపన చాలా మందికి ఉంటుందనే సంగతి తెలిసిందే. అందుకే 10వ తరగతి, ఇంటర్మీడియట్ అర్హత కలిగిన ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్, ఎంబీయే, ఎమ్మెసీ చదివిన వారు సైతం దరఖాస్తు చేసుకున్న సందర్భాలు ఎన్నో. ఈ క్రమంలో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో మరో ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ పడింది.
అవును... తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి వెలువడింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో ఉద్యోగాల భర్తీని నోటిఫికేషన్ వెలువడింది. ఈ సమయంలో.. 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దామ్..!
పోస్ట్ పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)
అర్హతలు: కనీసం పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 2025 డిసెంబర్ 14 నాటికి 18 - 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ లకు 10 ఏళ్ల వయరకూ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్ మెన్, మహిళలకు ఉచితం.. కాగా.. జనరల్, ఓబీసీలకు రూ.650
ఎంపిక విధానం: ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.
టైర్ - 1 (ఆబ్జెక్టివ్ ఎగ్జామ్)
టైర్ - 2 (డిస్క్రిప్టివ్ / స్కిల్స్ టెక్ట్)
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
జీతభత్యాలు: రూ.18,000 నుంచి రూ.56,900 (కేంద్ర ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం!)
దరఖాస్తు చివరి తేదీ: 14 డిసెంబర్ 2025
తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల వివరాలు: హైదరాబాద్ - 6, విజయవాడ - 3 పోస్టులు
