Begin typing your search above and press return to search.

2030 నాటికి AI ఏజెంట్లతో మారనున్న ఉద్యోగాల రూపురేఖలు..

ఏజెంటిక్ AI కేవలం పనులను స్వయంచాలకంగా పూర్తి చేయడమే కాకుండా మానవులతో కలిసి పనిచేస్తూ నిర్ణయాలను వేగంగా, సమర్థంగా తీసుకోవడంలో సహాయపడుతుంది.

By:  A.N.Kumar   |   7 Aug 2025 4:00 AM IST
2030 నాటికి  AI ఏజెంట్లతో మారనున్న ఉద్యోగాల రూపురేఖలు..
X

భారత్‌లో 2030 నాటికి కోటికి పైగా ఉద్యోగాల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. సర్వీస్‌నౌ విడుదల చేసిన 'AI స్కిల్స్ రీసెర్చ్ 2025' నివేదిక ప్రకారం.. సాంప్రదాయ ఆటోమేషన్‌కు భిన్నంగా ఏజెంటిక్ AI అనేది మానవ నిర్ణయాధికారాన్ని మెరుగుపరచడం ద్వారా పనితీరును సమూలంగా మార్చనుంది. ఏజెంటిక్ AI కేవలం పనులను స్వయంచాలకంగా పూర్తి చేయడమే కాకుండా మానవులతో కలిసి పనిచేస్తూ నిర్ణయాలను వేగంగా, సమర్థంగా తీసుకోవడంలో సహాయపడుతుంది.

-భారత సంస్థలు AIని వేగంగా స్వీకరిస్తున్నాయి

డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో భారతీయ సంస్థలు AIని తమ పనితీరులో ప్రధాన భాగంగా చేసుకుంటున్నాయి. నివేదిక ప్రకారం.. భారతదేశంలోని 25% సంస్థలు ఇప్పటికే AI ట్రాన్స్‌ఫార్మేషన్ దశలో ఉన్నాయి. ఇది భవిష్యత్తులో కొత్త టెక్ ఉద్యోగాలకు భారీగా అవకాశాలు సృష్టిస్తుంది.2030 నాటికి దేశంలో దాదాపు 30 లక్షల కొత్త టెక్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయి. వీటిలో AI, డిజైన్, డేటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగాల డిమాండ్ పెరుగుతుంది.

ఏ రంగాల్లో AI ప్రభావం ఎక్కువగా ఉంటుంది?

నివేదిక ప్రకారం, మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్, విద్య రంగాల్లో AI ప్రభావం అత్యధికంగా ఉండనుంది. : ఈ రంగంలో 80 లక్షల ఉద్యోగాలపై AI ప్రభావం చూపనుంది. దీనిలో ఆపరేషన్స్, మెయింటెనెన్స్, లాజిస్టిక్స్ వంటి పనులను AI నిర్వహిస్తుంది. రిటైల్ లో సుమారు 76 లక్షల ఉద్యోగాలపై ప్రభావం చూపి, కస్టమర్ సర్వీస్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, స్టాక్ ఫోర్‌కాస్టింగ్ వంటి బాధ్యతలను AI చేపడుతుంది. ఎడ్యుకేషన్ రంగంలో 25 లక్షల ఉద్యోగాలు మారబోతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ పనులను AI స్వీకరించి, ఉపాధ్యాయులు వ్యక్తిగత లెర్నింగ్ అనుభవాలపై దృష్టి పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది.

-భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు

AI ఆధారిత ఉద్యోగాల్లో భారీగా విస్తరణ కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడుతున్న ఉద్యోగాలలో అత్యధిక ప్రాధాన్యత ఉన్నవి. AI కాన్ఫిగరేటర్లలో 66% సంస్థలు ఈ ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. 65% సంస్థలు డేటా సైంటిస్టులను నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఎక్స్‌పీరియన్స్ డిజైనర్లు 57% సంస్థలు ఈ రోల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ కొత్త రోల్స్ సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, వ్యూహాత్మక ఆలోచనల కలయికగా మారుతున్నాయి.

- సవాళ్లు -భవిష్యత్ కార్యాచరణ

భారతీయ సంస్థలు తమ టెక్నాలజీ బడ్జెట్‌లో 13.5% AI కోసం వెచ్చిస్తున్నాయి. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. 30% సంస్థలు డేటా భద్రతను ఒక ప్రధాన సమస్యగా భావిస్తున్నాయి. 26% సంస్థలు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించడంలో , ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

భారతదేశంలో యువశక్తి - డిజిటల్ సంసిద్ధత పుష్కలంగా ఉన్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సంస్థలు పైలట్ ప్రాజెక్టులకు మాత్రమే పరిమితం కాకుండా, సమగ్రమైన AI వ్యూహాలను అనుసరించడం తప్పనిసరి. నైతికత, పారదర్శకత, అప్‌స్కిల్లింగ్‌ను ప్రాతిపదికగా చేసుకుని మానవ-AI కలయికతోనే రాబోయే ఉద్యోగ ప్రపంచం నిర్మితం అవుతుంది. నేటి పెట్టుబడులే రేపటి అభివృద్ధికి బలమైన పునాది వేయనున్నాయి.