Begin typing your search above and press return to search.

14,000తో సంబంధం లేదు.. మరికొంతమందికి అమెజాన్ షాక్!

అవును... అమెజాన్ లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు సంస్థ వాషింగ్టన్ రాష్ట్రానికి కొత్త నోటీసు దాఖలు చేసింది.

By:  Raja Ch   |   16 Dec 2025 10:48 AM IST
14,000తో సంబంధం లేదు.. మరికొంతమందికి అమెజాన్  షాక్!
X

ఈ ఏడాది అక్టోబర్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన 14,000 కార్పొరేట్ తొలగింపులకు సంబంధం లేకుండా.. మరికొన్ని ఉద్యోగాలను తొలగించాలని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెజాన్ వాషింగ్టన్ రాష్ట్రానికి కొత్త నోటీసు దాఖలు చేసింది. దీనిని సాధారణ ప్రక్రియ అని పేర్కొంటూ.. ఈ ఉద్యోగ కోతలు విస్తృత శ్రామిక శక్తి చర్యలతో ముడిపడి లేవని కంపెనీ ప్రతినిధి కూడా ధృవీకరించారు.

అవును... అమెజాన్ లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు సంస్థ వాషింగ్టన్ రాష్ట్రానికి కొత్త నోటీసు దాఖలు చేసింది. ఇందులో భాగంగా కంపెనీ 84 ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు చెబుతూ... ఈ కోతలు అక్టోబరులో ప్రకటించిన 14,000 తొలగింపులకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా... కంపెనీ తన వ్యాపారాలు క్రమం తప్పకుండా సమీక్షిస్తుందని, ఫలితంగా పలు సర్దుబాట్లు చేయవచ్చని పేర్కొంది.

వర్కర్ అడ్జస్ట్ మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ చట్టం (వార్న్ చట్టం) రాష్ట్ర కొత్త వెర్షన్ ప్రకారం.. ముందస్తు నోటీసు ఇచ్చిన 90 రోజుల్లోపు జరిగే అన్ని తొలగింపులను కంపెనీలు బహిర్గతం చేయాలి. ఈ కొత్త రాష్ట్ర చట్టం ప్రకారం అమెజాన్ సంస్థ వాషింగ్టన్ అథారిటీలకు నోటీసు దాఖలు చేసింది.

ఈ సందర్భంగా స్పందించిన అమెజాన్ ప్రతినిధి బ్రాడ్ గ్లాసర్... తాము ఇలాంటి నిర్ణయాలు తేలికగా తీసుకోమని అన్నారు. కంపెనీ ప్రభావిత ఉద్యోగులకు 90 రోజుల పాటు పూర్తి జీతం, ప్రయోజనాలు, హెల్త్ కవరేజ్ సేవలను అందిస్తోందని తెలిపారు. ఈ తొలగింపుల్లో సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్లు, ప్రోగ్రాం మేనేజర్లు, రిక్రూటర్లు, హెచ్.ఆర్.నిపుణులు, యూఎక్స్ డిజైనర్లు ఉన్నారు.

కాగా... అక్టోబర్ లో అమెజాన్ వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్, బెల్లేవ్ కార్యాలయాల్లో 2,303 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ సంఖ్య కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 14,000 ఉద్యోగాలకు చేరింది. కంపెనీని క్రమబద్దీకరించడానికి సీఈఓ ఆండీ జాస్సీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ కోతలను ప్రకటించింది.