Begin typing your search above and press return to search.

రూ.2 కోట్ల బీమా కావాలా నాయనా.. మన ఎల్ఐసీ వచ్చేసింది.. ప్లాన్లు ఇవీ

అయినా ఎల్ఐసీ స్థానం తగ్గలేదు. దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీగా ఇది స్థిరపడింది. ఇప్పటికీ కోట్ల టర్నోవర్, ఆస్తులతో కొనసాగూతూనే ఉంది.

By:  A.N.Kumar   |   5 Dec 2025 2:09 PM IST
రూ.2 కోట్ల బీమా కావాలా నాయనా.. మన ఎల్ఐసీ వచ్చేసింది.. ప్లాన్లు ఇవీ
X

మన చిన్నప్పటి రోజులు అవి.. అప్పట్లో పెద్దగా వ్యాపారాలు, జాబులు లేవు. వ్యవసాయం చేసుకుంటూ పొట్టపోసుకునేవాళ్లం.. ప్రమాదమో.. పాము కాటుతోనే ఏదైనా రోగంతోనే చస్తే ఆ కుటుంబాలు రోడ్డునపడేవి. అందుకే నాడే ‘ఎల్ఐసీ’ పాలసీలు తీసుకోండి.. మీ కుటుంబాలను రోడ్డున పడకుండా’ కాపాడుకోండి అని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. చాలా మంది తమకుపూటకు వెళ్లకున్నా వీటికోసం ఆరునెలలు, ఏడాదికోసారి పోగు చేసి ఎల్ఐసీ ఇన్సూరెన్సులు తీసుకునే వారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో జనాల్లో నమ్మకం బలపడింది. ప్రాణం పోయిన నెలల్లోపే డబ్బు చేతికి వచ్చి కుటుంబాలు నిలబడడంతో దీనిపై నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది.

అయితే కాలం మారింది. ప్రైవేటు సంస్థలు పోటెత్తాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటూ చనిపోతే కోటి రూపాయలు, 50 లక్షలు, 2 కోట్లు మీ చేతికొస్తాయనే సరికి జనాలు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల వెంట పడుతున్నాయి. అయినా ఎల్ఐసీ స్థానం తగ్గలేదు. దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీగా ఇది స్థిరపడింది. ఇప్పటికీ కోట్ల టర్నోవర్, ఆస్తులతో కొనసాగూతూనే ఉంది.

ప్రైవేటు పోటీని తట్టుకునేందుకు ఎల్ఐసీ కూడా మారింది. కొత్త కొత్త పాలసీలతో జనాలను ఆకర్షించే పని పెట్టుకుంది. తాజాగా ఈ ప్రభుత్వ రంగ ఎల్ఐసీ సంస్థ రెండు కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లతో మన ముందుకొచ్చింది. పాలసీ వినియోగదారుల అభిరుచి.. మారిన కాలానుగుణంగా ఈ కొత్త ప్లాన్లను జనాల ముందుకు తీసుకొచ్చింది.

ఇందులో ప్రధానంగా రెండు ప్లాన్లను ప్రస్తుతం ఎల్ఐసీ తీసుకొచ్చింది. అందులో ఒకటి ‘ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ (ప్లాన్ 886), బీమా కవచ్ (887) పేరిట వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ అనేది పూర్తిగా ‘సేవింగ్స్’ ప్లాన్ కాగా.. బీమా కవచ్ అనేది పూర్తిగా ఏమైనా మనకు ఆపద జరిగితే ‘రిస్క్ ప్రొటెక్షన్ ప్లాన్’ గా పేర్కొన్నది.

*ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ 886 వివరాలివీ..

ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ అనేది పూర్తిగా మార్కెట్ తో అనుసంధానమైన ప్లాన్ గా చెబుతున్నారు. ఇందులో బీమా, సేవింగ్స్ రెండూ ఇమిడి ఉండడం విశేషం. పాలసీ ఉన్నన్నీ నాళ్లు పాలసీదారుడికి ఇందులో బీమా రక్షణ ఉంటుంది. ఈ పాలసీ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ను ఐదు ఫండ్ లుగా ఎంచుకోవచ్చు. ఇందులో బాండ్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బ్యాలెన్స్ డ్ ఫండ్, గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్ అంటూ ఐదు ప్లాన్లుఏర్పాటుచేశారు. ఇందులో టాప్ అప్ ఎంచుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు. ఇక ఇందులో మరో విశేషం ఏంటంటే.. పాలసీ ఐదేళ్ల తర్వాత పాక్షిక్షంగా మన డబ్బును ఉపసహరించుకునే అనుమతి ఇవ్వడం విశేషం. రెగ్యులర్ పే, లిమిటెడ్ పే ఆప్షన్లతో మన దగ్గర ఉన్నంత డబ్బును వేసుకునే స్వేచ్ఛను ఈ పాలసీలో ఇవ్వడం విశేషం. ఈ పాలసీ తీసుకునేందుకు 18-65 ఏళ్ల మధ్య వయసు వారికే అర్హత. 5,7,10,15 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. 10,15,20,25 ఏళ్లు పాలసీ టర్మ్ ఉంటుంది. గరిష్ట మొత్తంపై పరిమితి లేదు.. పాలసీ చెల్లింపు వ్యవధి ఆధారంగా మీరు ప్రీమియంను డిసైడ్ చేసుకోవచ్చు. పాలసీ దారుడికి ఏదైనా రిస్క్ జరిగితే చెల్లించిన మొత్తం ప్రీమియంకు 105 శాతం చెల్లిస్తారు.

*ఎల్ఐసీ బీమా కవచ్ ప్లాన్ 887

ఇదొక వ్యక్తిగత నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్ గా తీసుకొచ్చారు. ఇందులో ప్రీమియం కట్టే వ్యక్తి మరణిస్తూ పూర్తి రిస్క్ ప్రొటెక్షన్ ప్లాన్ గా ప్రవేశపెట్టారు. అంటే టర్మ్ పాలసీ తరహాలో తీసుకొచ్చారు. కుటుంబాలకు ఆర్థిక రక్షణ ఇవ్వడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ఫిక్డ్స్ మొత్తం అయినా కట్టొచ్చు. లేదంటే సంవత్సరానికోసారి మొత్తాన్ని చెల్లించవచ్చు. 18-65 ఏళ్ల వయసు వారు అర్హులు. 2కోట్ల బీమా హామీతో పాలసీ ప్రారంభమవుతుంది. రూ.5 లక్షలు చొప్పు ఎంతైనా పెంచుకోవచ్చు. గరిష్ట మొత్తంపై పరిమిత లేకపోవడం విశేషం. సింగిల్ పేమంట్ గానైనా.. 5, 10, 15, ఏళ్లు ప్రీమియం అయినా చెల్లించవచ్చు. టర్మ్ ఆధారంగా ప్రీమియం మొత్తం ఉంటుంది.

ఈ పాలసీల గోల అర్థం కావాలంటే.. చూచాయగా చెప్పాలంటే.. ఎల్ఐసీ బీమా కవచ్ ప్లాన్ 887 అంటే టర్మ్ పాలసీ లాంటింది. అంటే మీ కుటుంబ పెద్ద మరణిస్తే ప్రీమియం కట్టిన కుటుంబానికి 2 కోట్ల నుంచి ఎక్కువ మొత్తం ఒకేసారి లభిస్తుంది.

ఇక రెండో పాలసీ ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ 886 ఇది మార్కెట్ లింక్డ్ పెట్టుబడి ఆధారంగా మీకు ఎక్కువ మొత్తం డబ్బులు రావడానికి ఉద్దేశించిన పథకం. సో ఈ రెండూ ప్రస్తుతం ప్రైవేటుకంపెనీలు అమలుచేస్తున్నాయి. ఇప్పుడు ఎల్ఐసీ కూడా రంగంలోకి దిగి ప్రభుత్వ రంగ సంస్థగా ప్రజల ఆదరణ చూరగొనడానికి మన ముందుకొచ్చింది.