ఫ్రీగా క్యాన్సర్ వ్యాక్సిన్...రష్యా కృషికి జోహార్లు
రష్యా ప్రపంచానికి ఆరోగ్య బంధువు కాబోతోంది. ఈ రోజున ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి పీడ వదిలించేందుకు రష్యా ఒక వ్యాక్సిన్ ని కనుగొంది.
By: Satya P | 16 Dec 2025 3:00 AM ISTరష్యా ప్రపంచానికి ఆరోగ్య బంధువు కాబోతోంది. ఈ రోజున ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి పీడ వదిలించేందుకు రష్యా ఒక వ్యాక్సిన్ ని కనుగొంది. ఈ వ్యాక్సిన్ తో మంచి ఫలితాలు వస్తున్నట్లుగా నిర్ధారిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఈ వ్యాక్సిన్ ని ఉచితంగా ప్రపంచానికి అందించేందుకు రష్యా ముందుకు రావడం శుభ పరిణామంగా పేర్కొంటున్నారు.
క్యాన్సర్ ఒక మహమ్మారి :
క్యాన్సర్ అన్నది ఒకపుడు తక్కువగా ఉండేది, ఇపుడు మారిన జీవన శైలి ఇతర కారణాల వల్ల పెద్ద ఎత్తున విస్తరిస్తోంది, ప్రపంచంలో గుండె పోటు మరణాతో పాటుగా క్యాన్సర్ మరణాలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. క్యాన్సర్ కి నివారణ లేదు, నియంత్రణకు కూడా పరిమితులు ఉన్నాయన్నది ఇప్పటిదాకా ఆధునిక వైద్య శాస్త్రంలో ఉన్న చికిత్సా విధానం చెబుతున్నది. అయితే రష్యా మాత్రం నివారణ దిశగా గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఎంతో పురోగతి సాధించింది. అంతే కాదు తాము ఉచితంగా ఈ వ్యాక్సిన్ ని ప్రపంచానికి అందజేస్తామని రష్యా ప్రకటించడంతో ఇది ప్రపంచ ఆరోగ్య రంగానికి ఒక కీలకమైన పరిణామంగా చెబుతున్నారు.
వ్యాక్సిన్ తయారీ వెనక :
ఇక రష్యా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ తయారీ వెనక అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయ్. ఎంఆర్ఎన్ఏ సాంకేతిక మీద ఈ వ్యాక్సిన్ ఆధారపడింది అని అంటున్నారు అలా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ నేరుగా రోగి శరీరంలోకి ప్రవేశించి క్యాన్సర్ ని అభివృద్ధి చేస్తున్న కణాలను గుర్తించి వాటిని నశింపచేయడం మీద ఫోకస్ పెడుతుంది. అదే సమయంలో రోగ నిరోధక వ్యవస్థను కూడా పటిష్టం చేస్తుంది, ఊపిరి తిత్తుల క్యాన్సర్ పాన్ క్రియాసిస్, మెలనోమా వంటి ఆరేడు ముఖ్యమైన క్యాన్సర్ రకాల మీద ఇది చాలా సమర్ధంగా పనిచేస్తుందని నిర్ధారించారు. ఇక రష్యాలోని గమాలేయా జాతీయ ఎపిడెమాలజీ మైక్రో బయాలజీ రిసెర్చ్ సెంటర్ లో ఈ వ్యాక్సిన్ ని తయారు చేశారు. ఇక ఈ వ్యాక్సిన్ ని ఫ్య్హూచర్ వీ అన్న పేరుని కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు.
సక్సెస్ అయిన క్లినికల్ ట్రయల్స్ :
ఇక ఈ వ్యాక్సిన్ కి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ తొలి రెండు దశలు సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యాయని చెబుతున్నారు. ఈ క్రమంలో వందకు ఐగా రోగుల మీద నిర్వహించిన పరీక్షలు సక్సెస్ అయ్యాయని అంటున్నారు. ఒక ట్యూమర్ పరిణామం కూడా ఏకంగా 35 నుంచి 50 పైగా తగ్గడం కూడా ఈ క్లినికల్ టెస్టులలో గమనించారు. అదే సమయంలో రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరిగింది అని అంటున్నరు. మూడవ దశ క్లినికల్ టెస్టులు అన్నవి 2026 లో మొదలవుతున్నాయి.
భారీ ప్రకటన :
ఇక రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ని ఫ్రీగా ప్రపంచంలో పంపిణీ చేయడానికి కూడా రష్యా నిర్ణయించింది. ఏకంగా పది కోట్ల డోసులను పంపిణీ చేస్తారు అని అంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు పేద దేశాలకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఇక ఈ ఫ్రీ పంపిణీ కనుక అమలులోకి వస్తే క్యాన్సర్ కోసం పెట్టే వైద్య ఖర్చులు చాలా పెద్ద ఎత్తున తగ్గుతాయని అంటున్నారు మొత్తానికి ప్రపంచానికి ఇది శుభ పరిణామం అని అంటున్నారు.
