Begin typing your search above and press return to search.

స్మోకింగ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుందా.. అధ్యయనంలో నమ్మలేని నిజాలు!

ధూమపానం వల్ల హాయిగా అనిపించడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ వివరాలు మీ కోసం ..

By:  Madhu Reddy   |   19 Feb 2026 10:00 PM IST
స్మోకింగ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుందా.. అధ్యయనంలో నమ్మలేని నిజాలు!
X

ఈరోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతోమంది సిగరెట్ అనే వ్యసనానికి బానిస అవుతున్నారు. కారణం లేకుండా కొందరు, ఒత్తిడి తగ్గుతుంది అని మరికొందరు ఇదో మెడిసిన్ లాగ అనుకుంటారు. ఇక చాలామంది టెన్షన్‌లో ఉన్నప్పుడు సిగరెట్ వెలిగిస్తే ప్రశాంతంగా ఉంటుందని భావిస్తారు. కానీ, ఇది కేవలం మెదడు చేసే మాయ మాత్రమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నికోటిన్ ఇచ్చే కిక్కు తాత్కాలికమే తప్ప, అది ఒత్తిడిని శాశ్వతంగా పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ధూమపానం వల్ల హాయిగా అనిపించడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ వివరాలు మీ కోసం ..

రిలాక్సేషన్ కాదు.. అదొక మెదడు మాయ:

చాలామంది స్మోకర్లు సిగరెట్ తాగగానే ఏదో తెలియని నిశ్శబ్దం, ప్రశాంతత లభించినట్లు అనిపిస్తుందని చెబుతుంటారు. నిజానికి సిగరెట్‌లోని 'నికోటిన్' రక్తంలో కలవగానే మెదడులో 'డోపమైన్' అనే కెమికల్ విడుదలవుతుంది. ఇది మీకు కొద్దిసేపు ఆనందాన్ని, హాయిని ఇస్తుంది. అయితే, ఇది కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ ప్రభావం తగ్గగానే మెదడు మళ్ళీ నికోటిన్ కోసం తహతహలాడుతుంది. దీనివల్ల మీకు తెలియకుండానే మీరు ఆ డ్రగ్‌కు బానిసవుతారు. అంటే మీరు పొందుతున్నది రిలాక్సేషన్ కాదు, నికోటిన్ అందక మెదడు పడే ఆవేదనను సిగరెట్ తాగి శాంతింపజేస్తున్నారన్నమాట ఇది తెలుసుకోవాలి అందరు.

దీర్ఘకాలంలో పెరిగే ఆందోళన.. ఊపిరితిత్తుల ముప్పు:

ఒత్తిడి తగ్గుతుందన్న భ్రమలో స్మోకింగ్‌ను కొనసాగిస్తే, అది మానసిక ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతుంది. నికోటిన్‌కు అలవాటు పడిన మెదడు, సిగరెట్ దొరకనప్పుడు విపరీతమైన చిరాకు, కోపం, ఆందోళనకు గురవుతుంది. దీనివల్ల మనిషి సహజంగానే అసహనానికి లోనవుతాడు. ఇక శారీరక నష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గి, శ్వాస తీసుకోవడం భారమవుతుంది. రక్తం గడ్డకట్టడం, గుండె జబ్బులు రావడానికి కూడా ఇది ప్రధాన కారణం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మొదలుపెట్టిన ఈ అలవాటు, చివరికి మనిషిని రోగిగా మారుస్తుంది.

ఒత్తిడిని జయించే అసలైన మార్గాలు ఇవే:

ఒత్తిడి తగ్గించుకోవడానికి సిగరెట్ మీద ఆధారపడటం మానేసి, ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. టెన్షన్‌గా అనిపించినప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం, కాసేపు నడవడం లేదా నచ్చిన సంగీతం వినడం వంటివి మెదడుకు సహజమైన ఉపశమనాన్ని ఇస్తాయి. స్మోకింగ్ మానేయడం వల్ల మొదటి కొన్ని రోజులు ఇబ్బందిగా ఉన్నా, క్రమంగా మనసు ప్రశాంతంగా మారుతుంది. శరీరం తనంతట తానుగా విషతుల్యాలను బయటకు పంపడం మొదలుపెడుతుంది. అందుకే, అపోహలను నమ్మి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా, స్మోకింగ్‌కు స్వస్తి చెప్పడమే తెలివైన పని అంటున్నారు నిపుణులు.