రోజూ మామిడి తింటే బాడీలో ఇన్ని మార్పులా? అరే ఇదేంటి!
రోజూ మామిడి పండు తింటే మన బాడీలో ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
By: Madhu Reddy | 25 May 2026 2:00 PM ISTవేసవి లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి నచ్చే పండు మామిడి ఇది కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా రారాజే! రోజూ ఒక మామిడి పండు తినడం వల్ల మన శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరుగుతాయని సైన్స్ చెబుతోంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, ఇ మరియు ఎన్నో రకాల పోషకాలు మనల్ని హెల్తీగా ఉంచుతాయి. రోజూ మామిడి పండు తింటే మన బాడీలో ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అరుగుదల సూపర్ ఫాస్ట్:
మామిడి పండులో ఉండే 'అమైలేసెస్' అనే ఎంజైములు మనం తినే పిండి పదార్థాలను సులభంగా ముక్కలు చేస్తాయి. ఇక దీనికి తోడు ఇందులో ఉండే పీచు పదార్థం వల్ల గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రావు. ఇక రోజూ తినడం వల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా పెరిగి, ప్రతిరోజూ ఉదయాన్నే కడుపు కాళీ అవుతుంది.
మెరిసే చర్మం మీ సొంతం:
ఇందులో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ ఎ చర్మ కణాలను మళ్లీ కొత్తగా మారుస్తాయి. ఇవి చర్మ రంధ్రాల్లో మురికి చేరకుండా చూస్తూ, ఎండ వల్ల చర్మం పాడవకుండా కాపాడతాయి. ఇక దీనిలోని విటమిన్ సి, విటమిన్ ఇ కాంబినేషన్ వల్ల కొద్ది రోజుల్లోనే చర్మంపై ముడతలు తగ్గి, ముఖంపై ఒక నాచురల్ గ్లో వస్తుంది.
రోగనిరోధక శక్తికి తిరుగులేదు:
మన శరీరానికి రోజువారీ అవసరమయ్యే విటమిన్ సి లో ముప్పావు వంతు కేవలం ఒకే ఒక్క మామిడి పండు ద్వారా అందుతుంది. ఇక ఇది తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, సీజనల్ రోగాలు రాకుండా రక్షణ కవచంలా నిలుస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫోలేట్, విటమిన్ బి శరీర రోగనిరోధక వ్యవస్థను ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచుతాయి.
కళ్లకు నాచురల్ సన్‌గ్లాసెస్:
మామిడి పండ్లలో లూటిన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొబైల్ స్క్రీన్లు, ఎండ నుంచి వచ్చే హానికరమైన బ్లూ లైట్‌ను ఫిల్టర్ చేస్తాయి. అంటే ఇవి కళ్లకు సహజమైన సన్‌గ్లాసెస్‌లా పనిచేస్తాయన్నమాట. ఇక ఇవి కంటి అలసటను తగ్గించి, వయసు పెరిగినా కేటరాక్ట్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.
బ్లడ్ షుగర్ కంట్రోల్:
మామిడి పండు తియ్యగా ఉన్నప్పటికీ, దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇందులో ఉండే 'మాంగిఫెరిన్' అనే పదార్థం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. కాబట్టి పరిమితిగా రోజూ తినడం వల్ల బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్‌లో ఉంటుంది. ఇక ఇది మెదడుకు, కండరాలకు రోజంతా స్థిరమైన శక్తిని ఇస్తుంది.
మామిడి పండు కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు.. విటమిన్లు, పోషకాల గని. రోజూ పరిమితంగా ఒక మామిడి పండును మన డైట్‌లో చేర్చుకుంటే పొట్ట, చర్మం, కళ్లు, మెదడు అన్నీ హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో దొరికే మామిడి పండ్లను అస్సలు మిస్ అవ్వకండి..
