మగాళ్లూ బీ అలెర్ట్.. బ్రెస్ట్ క్యాన్సర్ మీకు కూడా.. లక్షణాలివే!
హా.. బ్రెస్ట్ క్యాన్సరా.. మనకెందుకు వస్తుందిలే.. వచ్చేది ఆడవాళ్ళకి కదా.. అని నిర్లక్ష్యం చేశారో ఇక అంతే అంటూ హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ ఈఎస్ఐసీ వైద్యులు..
By: Madhu Reddy | 11 April 2026 3:00 PM ISTహా.. బ్రెస్ట్ క్యాన్సరా.. మనకెందుకు వస్తుందిలే.. వచ్చేది ఆడవాళ్ళకి కదా.. అని నిర్లక్ష్యం చేశారో ఇక అంతే అంటూ హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ ఈఎస్ఐసీ వైద్యులు.. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించిన ఈ పరిశోధనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రత్యేకించి సగటు వయసు దాటిన తర్వాత మగవారిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయని ఆ పరిశోధనలో తేలింది. మరి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం..
2020లో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 23 లక్షల మంది స్త్రీలు రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. వారిలో పది లక్షల మందికి పైగా మహిళలు మరణించారు. పైగా ప్రపంచంలో అధికంగా బ్రెస్ట్ క్యాన్సర్ తోనే బాధపడుతున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే రొమ్ము క్యాన్సర్ మగవారిలో కూడా వచ్చే అవకాశం ఉందని.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా .. ఇది అక్షర సత్యం.
ఇదిలా ఉండగా గతంలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ జరిపిన సర్వేలో అమెరికాలో బయటపడిన ప్రతి 100 రొమ్ము క్యాన్సర్ కేసుల్లో ఒకటి పురుషుల్లో బయటపడుతుంది. మగవారిలో కూడా వస్తున్న క్యాన్సర్లు సాధారణమని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు హైదరాబాద్ ఈఎస్ఐసీ వైద్యులు కూడా మగవారిలో వచ్చే రొమ్ము క్యాన్సర్ గురించి తెలిపారు. మగవారిలో వచ్చే రొమ్ము క్యాన్సర్ విషయానికొస్తే.. అందులో ఒకటి ఇన్వాసిస్ డక్టల్ కార్సినోమా.. ఈ రకమైన క్యాన్సర్ వచ్చినప్పుడు రొమ్ము కణజాలంలోని నాళాలు.. ఇతర భాగాలలో క్యాన్సర్ కణాలుగా పెరగడం ప్రారంభం అవుతాయి . ఇది ఇతర ప్రాణాలకు వ్యాపిస్తాయి. ఇక మరొకటి ఇన్వాసిస్ లోబ్యూలర్ కార్సినోమా.. ఈ క్యాన్సర్ రొమ్ములోని లోబుల్స్ లో కణాలు పెరగడం ప్రారంభం అవుతాయి . అక్కడి నుంచి రొమ్ము కణజాలం అలాగే ఇతర భాగాలకి కూడా ఈ క్యాన్సర్ వ్యాపిస్తుంది.
ఇకపోతే డక్టల్ కార్సినోమా విషయానికి వస్తే ..ఇది రొమ్ము వ్యాధి. ఈ వ్యాధి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ముఖ్యంగా మగవారిలో అందరిలో ఈ రొమ్ము క్యాన్సర్ వస్తుందని చెప్పలేం.. అధికంగా 60 సంవత్సరాలు దాటిన మగవారి రొమ్ముల్లో క్యాన్సర్ కణితులు పెరుగుతాయి.. యువకుల్లో వచ్చే ప్రమాదం కాస్త తక్కువనే చెప్పాలి. కానీ ఖచ్చితంగా రావు అని కాదు కానీ ప్రతి ఒక్కరు తప్పకుండా జాగ్రత్తపడాలి అని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా మగవారిలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయానికొస్తే రొమ్ము లోపల వాపు కనిపిస్తుంది. నొక్కితే చేతికి గట్టిగా కూడా తగులుతుంది. నొప్పి ఉండదు. రొమ్ము ప్రాంతంలోని చర్మం పొరలుగా మారుతుంది. దద్దుర్లు వస్తాయి...ఆ ప్రాంతం నల్లబారుతుంది.. పైగా రొమ్ము దగ్గర చర్మం చికాకు పెడుతుంది. చను మొనల ప్రాంతంలో నొప్పి వస్తుంది. అలాగే చను మొనల నుంచి స్రావాలు, రక్తం కారడం జరుగుతుంది. అలాగే చంకల్లో చిన్న గడ్డలు చేతికి తగులుతాయి.
ఇకపోతే 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు ఎక్కువగా దీనికి గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే మగవారికి కూడా వారసత్వంగా జన్యువుల ద్వారా రొమ్ముకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతో ఉంది. కాబట్టి ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని అటు వైద్య నిపుణులు సూచిస్తున్నారు
