Begin typing your search above and press return to search.

మూత్ర విసర్జనను బలవంతంగా ఆపుతున్నారా.. ఇది చదివితే ఇక ఆపరు!

పనిలో బిజీగా ఉండో, ప్రయాణాల్లో ఉండో, సినిమా హాలులో ఉండి టాయిలెట్ కు వెళ్తే ఏదైనా సీన్ మిస్సైపోతామనో.. కారణం ఏదైనా మూత్ర విసర్జనను ఆపడం అత్యంత ప్రమాదకరం అని అంటున్నారు వైద్యులు.

By:  Raja Ch   |   22 Dec 2025 9:30 AM IST
మూత్ర విసర్జనను బలవంతంగా ఆపుతున్నారా.. ఇది చదివితే ఇక ఆపరు!
X

పనిలో బిజీగా ఉండో, ప్రయాణాల్లో ఉండో, సినిమా హాలులో ఉండి టాయిలెట్ కు వెళ్తే ఏదైనా సీన్ మిస్సైపోతామనో.. కారణం ఏదైనా మూత్ర విసర్జనను ఆపడం అత్యంత ప్రమాదకరం అని అంటున్నారు వైద్యులు. తొలుత అది పెద్ద ప్రమాదకరంగా అనిపించకపోయినా.. ఇది కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ సందర్భాగా డాక్టర్ జాసన్ కిమ్ కీలక సూచనలు చేస్తున్నారు.

అవును... మూత్ర విసర్జనను బలవంతంగా ఆపడం మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. మూత్రాశయం ఉపశమనం కోసం వేడుకుంటున్నప్పుడు విస్మరించడం, వాయిదా వేయడం ప్రమాదమని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ లోని స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయంలోని రినైసాన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో యూరాలజీ క్లీనికల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జాసన్ కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... మీ మూత్రపిండాలు మూత్రాన్ని తయారుచేస్తాయి.. ఆపై యురేటర్స్ అని పిలువబడే రెండు గొట్టాలను మూత్రాశయానికి పంపుతుంది.. సాధారణ మూత్రాశయ సామర్థ్యం 400 నుంచి 600 క్యూబిక్ సెం.మీ. అని తాను చెబుతాను అని అన్నారు. ఈ క్రమంలో మూత్రాశయం సగం నిండిన తర్వాత.. నాడీ గ్రాహకాలు మెదడుకు మూత్ర విసర్జన చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతాయని తెలిపారు.

ఇదే సమయంలో.. మూత్రంలో విషపదార్థాలు కేంద్రీకృతమై ఉంటాయని.. అందుకే మీ శరీరం దానిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. దాని వాసన మీకు తెలియదు కాబట్టి.. అది లోపల ఉన్నా పర్లేదని మీరు భావిస్తారని అన్నారు. ఈ శాస్త్రం ఆధారంగా మీ మూత్ర విసర్జనను ఆపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయని కిమ్ వివరించారు.

ఇందులో భాగంగా... మూత్ర విసర్జనను ఆపుకోవడం వల్ల మూత్ర నాళంలోకి బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. దీంతో.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా యూటీఐ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మూత్రాన్ని నిలుపుకోవడం వల్ల బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశం ఏర్పడుతుంది. అందుకే లైంగిక చర్య యొక్క ఘర్షణ బ్యాక్టీరియాను మూత్రనాళంలోకి నెట్టే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా స్త్రీ సె*క్స్ తర్వాత మూత్ర విసర్జన చేయమని చెబుతారు.

ఈ నేపథ్యంలో.. చికిత్స చేయకుండా వదిలేస్తే, యూటీఐ మూత్రపిండాలలోకి చేరి కిడ్నీ ఇన్ఫెక్షన్ పైలోనెఫ్రిటిస్‌ కు దారితీస్తుందని కిమ్ చెప్పారు. ఆ ఇన్ఫెక్షన్ కూడా అదుపు చేయకపోతే, రక్తప్రవాహ ఇన్ఫెక్షన్ లేదా యూరోసెప్సిస్ సంభవించవచ్చని వెళ్లడించారు. కాలక్రమేణా తరచుగా మూత్రాన్ని ఆపి ఉంచడం వల్ల మీ మూత్రాశయ కండరాలు ఒత్తిడికి గురయ్యి బలహీనపడతాయని.. ఫలితంగా తర్వాత అవి మూత్రాన్ని ఖాళీ చేయడానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయలేవని తెలిపారు!