Begin typing your search above and press return to search.

డీజేలతో అబార్షన్.. నిజాలు బయటపెట్టిన జర్మనీ యూనివర్సిటీ!

డీజే.. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, బర్త్డేలు.. ఇలా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిందంటే ముందుగా డీజేనే తీసుకొచ్చి పెడుతున్నారు.

By:  Madhu Reddy   |   5 Sept 2025 12:42 PM IST
డీజేలతో అబార్షన్.. నిజాలు బయటపెట్టిన జర్మనీ యూనివర్సిటీ!
X

డీజే.. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, బర్త్డేలు.. ఇలా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిందంటే ముందుగా డీజేనే తీసుకొచ్చి పెడుతున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్లలో తప్పితే ఎక్కువగా డీజేని పెట్టుకునే వారు కాదు. కానీ ఇప్పుడు వేడుకలలోనే కాదు వినాయక నిమజ్జనం అయినా.. దుర్గామాత నిమజ్జనం అయినా.. ఆఖరికి చనిపోయినా కూడా డీజే పెడుతూ సౌండ్ తో ఊరు ఊరు మొత్తం మార్మోగిస్తున్నారు.. అయితే వినోదం కోసం పెట్టే ఈ డీజే సౌండ్ తీవ్రత ఎంత విపరీతంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ముసలి వాళ్ళైతే ఈ డీజే దగ్గర నిల్చొని ఉంటే ఆ సౌండ్ కి తట్టుకోలేకపోతారు. ముఖ్యంగా శబ్దాలు తట్టుకోలేని వాళ్లు డీజే లు అంటేనే భయపడిపోతూ ఉంటారు.

అలాంటి ఈ డీజే సౌండ్ తో కేవలం ముసలి వాళ్లు,హార్ట్ పేషెంట్లు, చిన్నపిల్లలకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి అపాయమే అంటున్నారు జర్మనీ సైంటిస్టులు.. తాజాగా డీజే ల సౌండ్ గురించి ఓ అధ్యయనం చేసి సంచలన విషయాన్ని బయటపెట్టారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డీజే అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా డీజేని తీసుకొచ్చి పెడుతున్నారు. డీజే సౌండ్ కి ఆడవాళ్లు, మగవాళ్ళు,చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎగిరి గంతేస్తూ ఉంటారు. చివరికి చచ్చిపోయినా కూడా డీజేలను పెడుతూ డాన్సులు చేసుకుంటూ వెళ్తున్నారు. అలా పెళ్లిళ్ల నుండి చావుల వరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో డీజే బాక్సులను పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ఈ డీజే సౌండ్ ల వల్ల మనిషి ప్రాణాలకు చాలా అపాయం ఉంది అని జర్మనీలోని ఓ వర్సీటీ అధ్యయనంలో తేలింది.. డీజే శబ్దాలతో గుండె కొట్టుకునే వేగం.. కేవలం హార్ట్ పేషంట్ లలోనే కాదు నార్మల్ వాళ్లలో కూడా పెరుగుతుందని, ముఖ్యంగా డీజే సౌండ్ కి దగ్గరగా ఉంటే హార్ట్ లో ఒక రకమైన టెన్షన్ మొదలవుతుంది అని వాళ్ళు తేల్చేశారు. అంతేకాకుండా ఈ డీజే సౌండ్ కి విపరీతంగా బీపీ పెరిగి మెదడులోని నరాలు చిట్లిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చివరికి చనిపోయే అవకాశం కూడా ఉంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలు ఈ డీజే సౌండ్ లకి దగ్గరగా ఉంటే కడుపులో పిండం చనిపోయే అవకాశం ఉందని, అబార్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు గర్భం దాల్చిన నాలుగో నెల నుండి బిడ్డ పుట్టే వరకు కూడా గర్భిణీ స్త్రీలు డీజే సౌండ్ లకి దూరంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు.. డీజే సౌండ్ ని ఒక ఎంజాయ్మెంట్ గా పేదవాళ్ళు, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు పెట్టుకుంటున్నారు. కానీ ఇలాంటి డీజే సౌండ్ ల వల్ల చాలామందికి ప్రాణాపాయం ఉంది అని జర్మనీలోని ఓ వర్సీటీ అధ్యయనంలో తేలింది. ఇక ఈ విషయం బయటపడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ముసలి వాళ్లు, హార్ట్ పేషెంట్లు డీజే సౌండ్ లకి దూరంగా ఉండటమే మంచిది అంటూ సలహాలు ఇస్తున్నారు.