Begin typing your search above and press return to search.

ప్రతీ తొమ్మిది మందిలో ఒకరికి పెను ముప్పు...!

భారత దేశంలో ఆందోళన కలిగించే తీరులో మధు మేహం వ్యాధి విస్తరిస్తోంది. ఇది మహమ్మారిగా మారుతోంది.

By:  Satya P   |   17 Jan 2026 11:00 PM IST
ప్రతీ తొమ్మిది మందిలో ఒకరికి పెను ముప్పు...!
X

భారత దేశంలో ఆందోళన కలిగించే తీరులో మధు మేహం వ్యాధి విస్తరిస్తోంది. ఇది మహమ్మారిగా మారుతోంది. తన దూకుడుని కొనసాగిస్తోంది మధు మేహ వ్యాధి తన వేగవంతమైన ఎదుగుదలకు భారత్ ని కీలక స్థావరంగా ఎంచుకుంది అన్న వార్తలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా మధుమేహం మహమ్మారి శర వేగంగా విస్తరిస్తోంది అని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇందులో మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా భారత్ లో మాత్రం ఏకంగా 9 కోట్ల మంది మధుమేహం వ్యాధి బారిన పడి బాధపడుతున్నారని 2024 లెక్కల ప్రకారం వెలువడిన నివేదిక ఒకటి తెలియచేస్తోంది.

భారత్ ప్లేస్ అదే :

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల జాబితాలో తీస్తే భారత్ రెండో స్థానంలో ఉంది అని అంటున్నారు ఈ విసయంలో 14.8 కోట్ల మందితో చైనా మొదటి ప్లేస్ లో ఉందని చెబుతున్నారు. 3.9 కోట్ల మంది షుగర్ పేషంట్లతో అమెరికా థర్డ్ ప్లేస్ ని ఆక్రమించింది. అంటే భారత్ లో అత్యధికంగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది అని అంటున్నారు.

వరల్డ్ రేటు టాప్ లోనే :

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 20 ఏళ్ళ నుంచి 79 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారిలో 11 శాతం మంది మధుమేహం మహమ్మారి బారిన పడిన వారే అని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 58.9 శాతంగా ఉంది. అంటే మొత్తం 800 కోట్ల మంది ప్రపంచ జనాభా అనుకుంటే 13వ వంతు ప్రపంచ జనాభా షుగర్ పేషంట్లతో నిండి ఉంది అని అర్ధం అవుతోంది అంటున్నారు.

మరో పాతికేళ్ళకు :

ఇప్పటికే ఈ విధంగా మధుమేహం వ్యాధి విపరీతంగా విస్తరిస్తూంటే 2050 నాటికి ప్రపంచం ఎలా ఉంటుంది అంటే అనేక సవాళ్ళతో అత్యధికం అవుతుందని అంటున్నారు. ఏకంగా 85.4 కోట్ల మంది ప్రపంచ జనాభా మధుమేహ రోగులతో నిలయంగా మారుతుందని వైద్య నిపుణులు పరిశోధకులు అంచనా వేస్తూ చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో కూడా పేద మధ్య ఆదాయ దేశాలలో నూటికి 80 శతం మంది ఈ సుగర్ వ్యాధి బారిన పడతారు అని నివేదికలు చెబుతున్నాయి.

కారణాలు ఇవేనా :

రానున్న కాలంలో జనాభా మరింతగా పెరుగుతుందని, అలాగే వృద్ధాప్యం సమస్యలు ఉంటాయని, పట్టణీకరణ ప్రభావం కూడా అధికం అవుతుందని, మారుతున్న జీవన శైలితో షుగర్ వ్యాధి విస్తరించేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. ఇక మహిళలతో పోలిస్తే మగవారికి గ్రామాల కంటే పట్టణాల్లో మధుమేహ వ్యాధి అధికంగా ఉందని అంటున్నారు. ఇక 75 నుంచి 78 ఏళ్ళ మధ్యన చూస్తే కనుక ప్రతీ నలుగురిలో ఒకరు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని అంటున్నారు. ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకోవాలంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకోవడం అవసరం అని వైధ్య నిపుణులు సూచిస్తున్నారు.