వణికిస్తున్న చికున్‌గున్యా.. అక్కడ 7000కి పైగా కేసులు!
కరోనా మహమ్మారి 2020లో ఎంత విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Madhu Reddy | 6 Aug 2025 3:26 PM ISTకరోనా మహమ్మారి 2020లో ఎంత విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 2022లో అయితే ఏకంగా శవాలు పూడ్చడానికి కూడా స్థలం లేనంతగా పరిస్థితులు దిగజారిపోయాయి. దేశంతో సంబంధం లేకుండా ప్రతి దేశంలో కూడా ఈ కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టించింది. అంతర్జాతీయంగా చాలామంది ప్రజలు, అమాయకులు, చిన్నారులు, వృద్ధులు ఇలా ఎంతోమంది మృత్యువాత పడ్డారు. ఆ భయం ఇప్పటికీ ప్రజలను వెంటాడుతోంది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మరొక రోగం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అదే చికున్‌గున్యా . సాధారణంగా వాతావరణాన్ని బట్టి ఇలాంటి వ్యాధులు విజృంభిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వర్షాలు విస్తృతంగా పడుతుండడంతో దోమల వ్యాప్తి పెరిగిపోయింది. ఫలితంగా చికున్‌గున్యా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రతరం అవుతోంది. ముఖ్యంగా ఆ దేశంలో ఏకంగా 7వేలకు పైగా కేసులు నమోదవడంతో ఇతర దేశాల ప్రజలు కూడా భయాందోళనలకు గురి అవుతున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. చైనాలోని గువాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో ఈ వైరస్ చాలా బలంగా విజృంభిస్తోంది.. జూలై నెల నుండి ఇప్పటివరకు సుమారుగా 7000కు పైగా కేసులు నమోదయ్యాయి.. ఈ నేపథ్యంలోనే ప్రజారోగ్య అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఫోషాన్ నగరంలో దాదాపు 95% కేసులు నమోదైనట్లు అక్కడి వైద్య అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే చిన్నపాటి లక్షణాలతో హాస్పిటల్లో చేరిన వీరంతా మరో వారం రోజుల్లో డిస్చార్జ్ కానున్నట్లు సమాచారం. అంతేకాదు దక్షిణ ప్రావిన్స్ లోని 12 నగరాలలో గత వారంలోనే దాదాపు 3 వేల కొత్త ఇన్ఫెక్షన్లు నమోదైనట్లు తెలిపారు.
అటు ఫోషన్ వెళ్లి వచ్చిన హాంగ్ కాంగ్ పిల్లోడికి కూడా ఈ వైరస్ సోకినట్లు ఆ దేశం తెలిపింది.. ప్రస్తుతం చికున్‌గున్యా కేసులు ఎక్కువగా వ్యాప్తి కావడంతో అటు అమెరికా కూడా తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. చైనా టూర్ లో అప్రమత్తంగా ఉండాలి అని, జ్వరం, కీళ్ల నొప్పులు, ర్యాషెస్ వచ్చిన వాళ్ళు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి అని కూడా అధికారులు తెలిపారు.
ఇప్పటికే చైనాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇకపోతే అక్కడికి ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ తప్పనిసరిగా దోమ తెరలు ఉపయోగించాలి అని, ఇళ్లల్లో నిల్వ ఉన్న నీళ్లను వెంటనే తొలగించాలి అని తెలిపారు. అయితే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని కొంతమందికి.. 10,000 యువాన్ల వరకు జరిమానా కూడా విధించారట . మరి కొంతమంది నిబంధనలు పాటించకపోవడంతో ఇళ్లకు కరెంటును కూడా నిలిపివేసినట్లు సమాచారం.
వాస్తవానికి 2008లో చైనాలో మొదటిసారి ఈ వైరస్ బయటపడినప్పటి నుండి సమాచారం. అప్పటి నుంచీ దేశంలో ఈ వైరస్ వ్యాప్తి విస్తృతంగా పెరుగుతోంది. ఇక ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అక్కడి ప్రభుత్వాలు వినూత్నప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే చైనాలో వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడంతో మిగతా దేశాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా దోమ నివారణ చర్యలు చేపట్టాలి అని, ప్రతి ఒక్కరు దోమతెరలు వాడాలి అని , పచ్చిక బయళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అని , నీటి నిల్వ ఉంచకూడదని ఇలా ఊరు వాడ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరీ అవగాహన పెంచుతున్నారు. అంతేకాదు ప్రజలు అప్రమత్తమై వైరస్ వ్యాప్తిని అరికట్టాలని కూడా కోరుకుంటున్నారు.
