Begin typing your search above and press return to search.

బాడీలో చెత్తంతా అక్కడే.. నిర్లక్ష్యం చేశారో?

బొడ్డు అనేది కేవలం ఒక యాక్సెస్ పాయింట్ మాత్రమే కాదు, అది మన లోపలి ఆరోగ్య సమస్యలను బయటపెట్టే ఒక సంకేతం.

By:  Madhu Reddy   |   25 April 2026 4:15 PM IST
బాడీలో చెత్తంతా అక్కడే.. నిర్లక్ష్యం చేశారో?
X

మన శరీరంలో అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యే భాగం ఏదైనా ఉందంటే అది 'బొడ్డు' (నాభి) మాత్రమే. కేవలం అది ఒక మచ్చలా కనిపిస్తుంది కానీ, దాని వెనుక అద్భుతమైన జీవక్రియ దాగి ఉంది. తల్లి గర్భం నుంచి మనకు ప్రాణం పోసే వారధిగా మొదలై, జీవితాంతం మన ఆరోగ్య స్థితిని సూచించే సంకేతంగా ఇది నిలుస్తుంది. నాభి కేవలం శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన యాక్సెస్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు.

తల్లీబిడ్డల మధ్య అపురూప బంధం:

మనం ఈ భూమి మీదకు రావడానికి కారణమైన తల్లితో మనకున్న మొదటి కనెక్షన్ ఈ బొడ్డు తాడు. గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు కావాల్సిన ఆక్సిజన్, పోషకాలను ఈ నాళాలే మోసుకెళ్తాయి. ఇందులో సాధారణంగా మూడు రక్త నాళాలు ఉంటాయి. ఒకటి బిడ్డకు పోషకాలు అందిస్తే, మిగిలిన రెండు వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఇక పుట్టిన తర్వాత ఈ నాళాలు సహజంగానే మూసుకుపోయినా, వైద్యపరంగా వీటి ప్రాముఖ్యత మాత్రం తగ్గదు. పుట్టిన వెంటనే కొన్ని రకాల పరీక్షల కోసం డాక్టర్లు ఈ భాగం నుంచే రక్త నమూనాలను సేకరిస్తారు.

ఆరోగ్యాన్ని సూచించే అలారమ్:

బొడ్డు అనేది కేవలం ఒక యాక్సెస్ పాయింట్ మాత్రమే కాదు, అది మన లోపలి ఆరోగ్య సమస్యలను బయటపెట్టే ఒక సంకేతం. 19వ శతాబ్దంలో క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులను గుర్తించడానికి బొడ్డును ఒక ముఖ్యమైన ఆధారంగా వాడేవారు. పొత్తికడుపు లోపల క్యాన్సర్ తీవ్రత పెరిగినప్పుడు బొడ్డు వాపు రావడం ద్వారా వ్యాధిని పసిగట్టేవారు. అలాగే ఇక కొందరికి నాభిని చూస్తే ఒక రకమైన భయం కలుగుతుంది, దీన్నే 'ఓంఫాలోఫోబియా' అని పిలుస్తారు. ప్రస్తుతం ఫ్యాషన్ కోసం ట్యాటూలు, రింగులు వేయించుకుంటున్నా, దీని అసలు పనితీరు మాత్రం చాలా కీలకం.

శరీరంలో అత్యంత మురికి ప్రదేశం ఇదే!:

హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం మన శరీరంలో అత్యంత మురికిగా ఉండే భాగం బొడ్డు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది కొన్ని వందల రకాల బాక్టీరియాకు నిలయం. మనం వేసుకునే బట్టల దారాలు, శరీర చెమట, డెడ్ స్కిన్ సెల్స్, చివరకు స్నానం చేసినప్పుడు సరిగ్గా కడగని సబ్బు నురగ కూడా బొడ్డు రంధ్రంలోనే పేరుకుపోతాయి. ఇక ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు బొడ్డును క్లీన్ చేయకపోతే అక్కడ ఫంగస్ చేరి, దురద లేదా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందుకే శరీరంతో పాటు నాభి శుభ్రత కూడా చాలా ముఖ్యం.

నాభి శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం:

ఇక మన శరీరంలోని అనేక నరాలకు నాభి కేంద్ర బిందువులా పనిచేస్తుంది. అందుకే నాభిలో ఏదైనా మార్పులు కనిపించినా, రంగు మారినా లేదా వాపు వచ్చినా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అది లోపల ఏదో ఆరోగ్య సమస్య ఉందనడానికి హెచ్చరిక కావచ్చు. మన ఆరోగ్యం గురించి చాలా విషయాలను నిశ్శబ్దంగా చెప్పే ఈ నాభిని రోజూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చు.

బొడ్డు అనేది మన పుట్టుకకు గుర్తు మాత్రమే కాదు, మన జీవక్రియలో ఒక భాగం. కాబట్టి ఫ్యాషన్ పేరుతో దాన్ని ఇబ్బంది పెట్టకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్నానం చేసేటప్పుడు ఒక నిమిషం కేటాయించి నాభిని క్లీన్ చేసుకుంటే చాలు, సగం ఇన్ఫెక్షన్లు దరిచేరవు.